Liver : ఈ ఆహారాలు తింటే లివర్‌ క్లీన్‌ అవుతుంది..! కాలేయం ఆరోగ్యానికి ఇవి కావాల్సిందే..!

Liver  : ఇళ్లు శుభ్రంగా లేకపోతే.. మనం చీపురుతో క్లీన్‌ చేస్తాం.. కానీ బాడీలో కూడా అంతే చెత్త ఉంటుంది.. అది మనకు కనిపించదు. బాడీలో ఉన్న పార్ట్స్‌ ఒక్కొక్కటి ఒక్కో పని చేసి మన శరీరాన్ని క్లీన్‌ చేస్తాయి.. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను

Liver : ఈ ఆహారాలు తింటే లివర్‌ క్లీన్‌ అవుతుంది..! కాలేయం ఆరోగ్యానికి ఇవి కావాల్సిందే..!


Liver  : ఇళ్లు శుభ్రంగా లేకపోతే.. మనం చీపురుతో క్లీన్‌ చేస్తాం.. కానీ బాడీలో కూడా అంతే చెత్త ఉంటుంది.. అది మనకు కనిపించదు. బాడీలో ఉన్న పార్ట్స్‌ ఒక్కొక్కటి ఒక్కో పని చేసి మన శరీరాన్ని క్లీన్‌ చేస్తాయి.. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపే డ్యూటీ లివర్‌ది.. ఈ క్ర‌మంలో లివ‌ర్ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌లిగించ‌డ‌మే కాక‌.. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ల‌గ‌జేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యం కూడా న‌శిస్తుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే.. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేక‌పోతే లివ‌ర్ ఎక్కువ‌గా డ్యామేజ్ అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎప్ప‌టికప్పుడు అవి తిరుగుతూ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. లివ‌ర్ శుభ్రం అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే ఆ ఆహారాలు ఏమిటో చూద్దామా..!


ఉసిరికాయ జ్యూస్

ఉసిరికాయ జ్యూస్ లివ‌ర్‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన టానిక్‌లా ప‌నిచేస్తుంది. దీన్ని ఆయుర్వేద మందుల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్రభావాన్ని త‌గ్గించి లివ‌ర్‌ను శుభ్ర‌ప‌రుస్తాయి. నిత్యం ఉసిరికాయ జ్యూస్ తాగ‌డం లేదా 1 నుంచి 3 గ్రాముల ఉసిరి కాయ పౌడ‌ర్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి

ఈ రెండు ఆహారాలు లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. వీటిల్లో ఫ్లేవ‌నాయిడ్లు అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. నిత్యం ప‌చ్చి వెల్లుల్లి రెబ్బలు 2, 3 లేదా ప‌చ్చి ఉల్లిపాయ‌లు 50 గ్రాములు తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

ప‌సుపు

పసుపుతో ఒక్క లివరేంటి..బాడీలో అన్నీ పార్ట్స్‌ను క్లీన్‌ చేసుకోవచ్చు.. ప‌సుపును నిత్యం 1.5 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకుంటే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

ద్రాక్ష

లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో ద్రాక్ష‌లు కూడా అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిత్యం ఒక క‌ప్పు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

న‌ట్స్

బాదం, పిస్తా, వాల్‌న‌ట్స్‌లో ఉండే విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. 6 నెల‌ల పాటు నిరంత‌రాయంగా న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి నుంచి బయటపడొచ్చని.. సైంటిస్టుల అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. నిత్యం ఒక గుప్పెడు న‌ట్స్‌ను తింటే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో బీటాలెయిన్స్‌, ఫ్లేవ‌నాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. వారంలో క‌నీసం 2, 3 రోజుల పాటు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే చాలు.. లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది.

చేప‌లు, కోడిగుడ్లు, వాల్‌న‌ట్స్

వీటిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లివ‌ర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. వారంలో కనీసం 2 సార్లు ఈ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

ఆలివ్ ఆయిల్‌

ఆలివ్ ఆయిల్‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌ను నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకున్నా చాలు లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

అల్లం

అల్లం తింటే లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే జింజ‌రాల్స్‌, షోగోల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. నిత్యం 4 గ్రాముల అల్లం తీసుకున్నా లేదా అల్లం ర‌సం తాగినా కొద్ది రోజుల్లోనే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ సుర‌క్షితంగా ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.