మీ డైట్లో ఈ మార్పులు చేసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఈజీగా కరుగుతాయ్..!

కిడ్నీ స్టోన్స్... మన చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉంటాo. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారి బాధ వర్ణణాతీతం. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. మూత్రానికి వెళ్లాలంటే మంట వేధిస్తూ ఉంటాయి. మహిళలతో పోలిస్తే..

మీ డైట్లో ఈ మార్పులు చేసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఈజీగా కరుగుతాయ్..!


కిడ్నీ స్టోన్స్... మన చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉంటాo. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారి బాధ వర్ణణాతీతం. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. మూత్రానికి వెళ్లాలంటే మంట వేధిస్తూ ఉంటాయి. మహిళలతో పోలిస్తే.. పురుషులకు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు నివేదికలో వెల్లడిస్తున్నాయి. ఒక సారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబట్టే ప్రమాదము ఉంది. సుమారు 50% మందికి ఏడేళ్లలోపే కిడ్నీ స్టోన్స్ రెండోసారి వచ్చే అవకాశముంది. 

మూత్రంలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. వాటిలో కొన్ని బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల కిడ్నీలో రాళ్ల ఏర్పడతాయి. దారితీస్తాయి. ఈ సమస్య తలత్తేందుకు చాలా వారాలు, నెలలు పట్టవచ్చు. ఐతే ఈ రాళ్లని కరిగించేందుకు అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే కొన్ని రకాల ఇంటి వైద్యాలతో కరిగించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
నీరు ఎక్కువగా తాగండి.
రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల వరకు మూత్రానికి వెళ్లే వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు అభివృద్ధి చెందే అవకాశం 50% తక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి . నీరు ఎక్కుగా తాగితే.. రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా మారి తేలికగా బయటకు వచ్చేస్తాయి. అందుకే రోజుకు కనీసం.. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిదని చెబుతున్నారు వైద్యులు.
సరిపడా కాల్షియం తీసుకోండి..
మీ డైట్లో కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకపోతే.. యూరిన్లో ఆక్జలేట్ స్థాయులు పెరిగి రాళ్లు ఏర్పడొచ్చు. కాల్షియం పేగులలో ఆక్సలేట్ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి. మగవారికి రోజుకు 1,000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. అలాగే 800-1,000 ఐయూ విటమిన్ డి కూడా తీసుకోవాలి. ఇది క్యాల్షియాన్ని శరీరం గ్రహించుకోవటంలో సహాయపడుతుంది.

నాన్వెజ్ తక్కువగా తినండి..

మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి మాంసాహార ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్ను యానిమల్ ప్రొటీన్ అంటారు. ఈ ప్రోటీన్.. మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాలను పెంచుతుంది, దీంతో కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్ స్థాయులు కూడా పడిపోతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. నాన్వెజ్ తక్కువగా తీసుకోవడం మంచిది.
ఉప్పు తగ్గించండి. ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే అనేక రకాల రుగ్మతలకు దారి తీస్తుంది. మూత్రంలో క్యాల్షియం స్థాయులు పెరిగేలా చేయటంలోనూ ఉప్పు కీలకపాత్ర వహిస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. 

నిమ్మరసం తాగండి..

కిడ్నీలో రాళ్లు నివారించడానికి.. నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే.. సిట్రిక్ యాసిడ్ కాల్షియంను బంధించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. రోజుకు రెండు నిమ్మకాయల రసం తాగడం వల్ల యూరిన్ సిట్రేట్ పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆక్జలేట్ పదార్థాలు తీసుకోవద్దు..

బీట్రూట్, చాక్లెట్, పాలకూర వంటి ఆహారపదార్థాల్లో ఆక్జలేట్ అధికంగా ఉంటుంది. ఆక్జలేట్ కిడ్నీలో రాళ్లకు దారితీస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు.. వీటికి దూరంగా ఉండటం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.