Pregnancy : గర్భిణీ చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసా..

Mistakes in pregnancy : గర్భంతో ఉన్నప్పుడు తన కడుపులో ఒక బిడ్డ జీవం పోసుకుంటుంది. ఈ విషయాన్ని తల్లి మరచిపోదు. ప్రతిక్షణం పుట్టే బిడ్డ కోసమే పరితపిస్తూ ఉంటుంది. చాలావరకు బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు అందే విధంగానే ఆహారం తీసుకుంటుంది.

Pregnancy : గర్భిణీ చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసా..
Mistakes in pregnancy


Pregnancy : గర్భధారణ స్త్రీకి ఒక వరం. మాతృత్వం పొందటం అంత తేలికైన విషయం ఏమి కాదు. ఈ అదృష్టం లేక ఈ రోజుల్లో ఎందరో తలడిల్లి పోతున్నారు. తల్లిగా మారే ఆ క్షణాల కోసం ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నారు. కొందరికి మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది.
గర్భంతో ఉన్నప్పుడు తన కడుపులో ఒక బిడ్డ జీవం పోసుకుంటుంది. ఈ విషయాన్ని తల్లి మరచిపోదు. ప్రతిక్షణం పుట్టే బిడ్డ కోసమే పరితపిస్తూ ఉంటుంది. చాలావరకు బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు అందే విధంగానే ఆహారం తీసుకుంటుంది. తన దినచర్యను మార్చుకుంటుంది. ఇన్ని చేసిన తెలిసి తెలియక కొన్ని పనులు చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు.
గర్భధారణ సమయంలో వికారం, వాంతులు, జ్వరం వంటివి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని అన్నివేళలా అజాగ్రత్త చేయకూడదు.
విడవకుండా వాంతులు, జ్వరం వస్తున్న కొందరు ఏం కాదులే అంటూ అజాగ్రత్త చూపిస్తారు. ఇలా కాకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

తల్లి మనసును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీని వలన పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అలాగే వారి జ్ఞాపకశక్తి సైతం మెరుగుపడుతుందని తెలుస్తోంది.
ఎలాంటి భయాందోళన, ఒత్తిడి ఉంచుకోకూడదు.
ఎలాంటి పండుగ వేళలు అయినా ఉపవాసం చేయకూడదు. అలా అని మితిమీరి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
పగటి పూట నిద్ర చేయకూడదు.
భయం కలిగించి, మనసుని చిరాకు తెప్పించే పనులు చేయకూడదు. అలాంటి మనుషులతో ఉండకూడదు. అలాంటి పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం వంటి పనులు చేయకూడదు.
ఎగుడు దిగుడు ఉన్నచోట కూర్చోకూడదు.
పొగ తాగే అలవాటు ఉన్నా.. మద్యం సేవించే అలవాటు ఉన్న వాటిని గర్భధారణ సమయంలో చేయకపోవడం మంచిది.
అధికంగా మాంసాహార పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకోకూడదు.
గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది.
గర్భధారణ సమయంలో ఇంగువ, వెల్లులి , నువ్వులు, బొప్పాయి, అధిక తీపి పదార్థాలు తినకూడదు.
వైద్యుల సూచన మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
వైద్యులు సూచించిన మందులు వాడటం తప్పనిసరి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.