పీరియడ్స్ సమయానికి రావడం లేదా? కారణాలు ఇవే.. నివారించడం తేలికే!

సాధారణంగా 13 ఏళ్ల వయసులో మొదలవ్వాల్సిన రుతు స్రావం కొందరిలో ముందు వెనక ఉంటుంది. అయితే ఈ కాలంలో పది ఏళ్లు కూడా నిండకుండానే చాలామందిలో రుతుస్రావం కనిపించడం ఆందోళన కలిగించే విషయమే..

పీరియడ్స్ సమయానికి రావడం లేదా? కారణాలు ఇవే.. నివారించడం తేలికే!


ప్రతి స్త్రీకి జీవితంలో భాగమై పోయే రుతుస్రావం లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మారిపోతున్న జీవన శైలిలో 28 రోజుల నుంచి 30 రోజులకు రావాల్సిన రుతు స్రావం రెండు నెలలు దాటిన రాకుండా పోతుంది. దీని వలన శరీరంలో ఏదో ఇబ్బందిగా అనిపించడంతో పాటు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకో గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా 13 ఏళ్ల వయసులో మొదలవ్వాల్సిన రుతు స్రావం కొందరిలో ముందు వెనక ఉంటుంది. అయితే ఈ కాలంలో పది ఏళ్లు కూడా నిండకుండానే చాలామందిలో రుతుస్రావం కనిపించడం ఆందోళన కలిగించే విషయమే.. ఎందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% మహిళలురుతుస్రావం కి సంబంధించి ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యానాల్లో తేలింది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు నుంచి ఉద్యోగాల్లో ఉన్న మహిళల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వేధిస్తుంది. వయసు పెరుగుతున్న కొలది ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. 30 నుంచి 42 ఏళ్ల వయసు మధ్యలో గర్భశయానికి సంబంధించిన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

గర్భం దాల్చినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మరిన్ని సమస్యల వల్ల రుతుస్రావంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమయంలోనే రుతుస్రావం గతి తప్పుతుంది.

రుతుస్రావం కొందరిలో 28 రోజులకి కచ్చితంగా వస్తే మరి కొందరిలో మాత్రం రెండు నెలలు మూడు నెలలు మరికొన్నిసార్లు ఆరు నెలలు కూడా పడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చిరాకు పెరిగిపోవడమే కాకుండా మనసులో ఏదో తెలియని అశాంతి ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది.

రుతుస్రావంలో అవరోధానికి కారణాలు..

గర్భాశయంలో ఏవైనా గడ్డలు ఉంటే రుతుస్రావం ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే గర్భాశయం పైన గోడల్లో ఒక పొర ఉంటుంది. ఈ పొర చిక్కగా మారిన రుతుస్రామంలో సమస్యలు ఏర్పడతాయి. ఈ పొరను బట్టి గర్భధారణ నిర్ధారించబడుతుంది. గర్భం వచ్చే అవకాశాలు సైతం ఉండవు.

అధికంగా బయట దొరికే ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినడం వల్ల శరీరంలో హార్మోన్లు గతితపుతూ ఉంటాయి. వీటి వలన నెలసరి సక్రమంగా రాదు.

సరైన వ్యాయామం లేకపోవడం, రుతుక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అధికంగా మానసిక ఒత్తిడి వంటివి కూడా నెలసరి గది తప్పడానికి కారణాలు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఎదుగుతున్న పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత కచ్చితంగా పోషకాహారం అందించాలి. శరీరంలో శక్తి కోల్పోకుండా చూసుకోవాలి.

ఆడపిల్లలు ఎక్కువగా కాఫీ, టీ వంటివి తీసుకోకపోవడం మంచిది మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులకి భయపడి మందులు వాడటం సరైన పద్ధతి కాదు.

నువ్వులు మినప గారెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.