గర్భంలో శిశువు తన్నడం ఏ నెలలో స్టాట్‌ అవుతుంది..?

ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినప్పటి నుంచి స్త్రీ కడుపులో ఎన్నో మార్పులు వస్తుంటాయి. పిండ రూపాంతరం చెందడం, ఒక్కో నెలలకు మార్పులు రావడం, చిన్న చిన్నగా అవయవాలు ఫామ్‌ అవ్వడం ఇవన్నీ జరురుగుతాయి. వీటి గర్భం దాల్చిన ప్రతి

గర్భంలో శిశువు తన్నడం ఏ నెలలో స్టాట్‌ అవుతుంది..?


ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినప్పటి నుంచి స్త్రీ కడుపులో ఎన్నో మార్పులు వస్తుంటాయి. పిండ రూపాంతరం చెందడం, ఒక్కో నెలలకు మార్పులు రావడం, చిన్న చిన్నగా అవయవాలు ఫామ్‌ అవ్వడం ఇవన్నీ జరురుగుతాయి. వీటి గర్భం దాల్చిన ప్రతి దశలోనూ శిశువు ఎదుగుదల గురించి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది అందరికీ. ఈ నేపథ్యంలోనే 20 వారాల గర్భధారణ సమయంలో శిశువు 6. 5 అంగుళాలుగా ఉంటుంది. అదే విధంగా ఇంకా ఏయే మార్పులు ఉంటాయో తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయిన దగ్గర నుంచి ఒక్కో దశలో ఎదుగుదల ఒక్కోలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 20వ వారంలో చక్కని జుట్టు పొర వస్తుంది. దీంతో వారి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. పిల్లల చర్మం పలుచగా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ మందంగా మారుతుంటుంది. ఇదే దశలో శిశువు కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని తల్లులు గమనిస్తారు. వారు కడుపులో తన్నడం, సాగదీయడం, తిప్పడం చేస్తారు. పుట్టే పిల్లలు చేసే కదలికలని తల్లులు ఆనందంగా ఆస్వాదిస్తారు. ఈ వారంలోనే పిల్లల అవయవాలు శుద్ధి అవుతాయి. వారికి వినికిడి శక్తి అభివృద్ధి చేస్తుంది. తల్లి గొంతు, శబ్ధాలను గుర్తిస్తారు. రుచులు కూడా వారి నాలుకకి తెలుస్తాయట. పుట్టిన తర్వాత వారు అనుభవించే రుచుల కోసం సిద్ధం చేస్తారు.

అవయవాల ఏర్పాటు.

ప్రతి దశలో పుట్టే పిల్లల అవయవాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. శిశువు జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ప్రేగులు అమ్నియోటిక్ ద్రవం నుంచి చిన్న మొత్తంలో చక్కెరని గ్రహిస్తాయి. కిడ్నీలు పనిచేస్తుంటాయి. మూత్రం ఉత్పత్తి అవుతుంది. కాలేయం వ్యర్థాలను కూడా ప్రాసెస్ స్టాట్‌ అవుతుంది.

బ్రెయిన్ డెవలప్‌మెంట్

మెదడు కూడా స్పీడ్‌గా అభివృద్ధి చెందుతుంది. శిశువు నాడీ కనెక్షన్లు మరింత బలంగా మారతాయి. రెటినాస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు అవి వెలుగు, చీకటిని కూడా గ్రహించగలవు. మెదడు కదలికలను కంట్రోల్ చేసేందుకు చప్పరించడం, మిగండం వంటి ప్రతిచర్యలని నేర్చుకుంటారు.

లింగ నిర్ధారణ

20వ వారంలో శిశువుల బాహ్య జననేంద్రియాలు ఏర్పడతాయి. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా లింగాన్ని నిర్ణయిస్తారు.

స్లీప్ వేక్ సైకిల్స్

బేబీ రెగ్యులర్ స్లీప్ వేక్ సైకిల్స్ అనుభవిస్తారు. వారు ఎప్పుడు నిద్రపోవాలి, లేవాలి ఇలాంటవన్నీ తెలుసుకోగలుగుతారు.
 
ప్రతి బిడ్డ కూడా వారి వారి సొంత వేగంతో అభివృద్ధి చెందుతుంది. ఈ కీలక మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. దీంతో వారి ఎదుగుదల, ఆరోగ్యాన్ని గమనించడానికి, పెరుగుదలని పర్యవేక్షించేందుకు రెగ్యులర్ ప్రినేటల్ చెకప్స్, డాక్టర్ కన్సల్టేషన్స్ ముఖ్యమైనవి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.