పిరియడ్స్‌ ఆలస్యంగా వస్తున్నాయా.. కారణాలు ఇవే..

ఆడవాళ్లకు ఉన్న అతిపెద్ద సమస్య.. periods..ఇవి వచ్చినా ప్రాబ్లమే..రాకపోయినా లొల్లే.. వీటితోని ఏగడం ఆడవారికే సాధ్యం.. periods టైమ్‌కు వస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ మనం చేసే కొన్ని తప్పుల వల్ల సైకిల్‌ మిస్‌ అవుతుంది. అలా పిరియడ్‌ సైకిల్‌ మిస్‌ అయిందంటే.. అనవసరమైన సమస్యలు.

పిరియడ్స్‌ ఆలస్యంగా వస్తున్నాయా.. కారణాలు ఇవే..
Reasons for late periods


ఆడవాళ్లకు ఉన్న అతిపెద్ద సమస్య.. periods..ఇవి వచ్చినా ప్రాబ్లమే..రాకపోయినా లొల్లే.. వీటితోని ఏగడం ఆడవారికే సాధ్యం.. periods టైమ్‌కు వస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ మనం చేసే కొన్ని తప్పుల వల్ల సైకిల్‌ మిస్‌ అవుతుంది. అలా పిరియడ్‌ సైకిల్‌ మిస్‌ అయిందంటే.. అనవసరమైన సమస్యలు.. ఇంతకీ ఆ తప్పులేంటి..? 
 

 తప్పుడు కాంబినేషన్ గల ఆహారం..

కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. మనం తినే ఆహారం మన జీర్ణ క్రియకు తోడ్పడేలా, పోషకాల శోషణకు గ్రహించుకునేలా చేస్తుంది. కానీ కొన్ని తప్పుడు కాంబినేషన్లలో ఆహారం ఈ ప్రక్రియను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా లంచ్ తరువాత పండ్లు తినడం, బ్రేక్‌ఫాస్ట్‌తో టీ తాగడం వల్ల అవసరమైన పోషకాల శోషణ నిలిచిపోతుంది. క్రమం తప్పకుండా పీరియడ్స్ రావడానికి పోషకాలు అవసరం..

మితిమీరిన ప్రాసెస్డ్ ఫుడ్

ఇటీవలి కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ అమితంగా తినడం అందరికీ సాధారణమై పోయింది. అధిక క్యాలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరస్థాయి అధికంగా ఉండడం వల్ల ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అధిక బరువుకు కారణమవుతుంది. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అమాంతం పెంచేస్తుంది. ఈ కారణంగా రుతు చక్రంలో అవసరమైన హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ విడుదలపై ప్రభావం చూపుతాయి.

భోజనం టైమ్‌కు చేయకపోవడం

కోటి విద్యులు కూటి కొరకే అంటారు.. మనం ఎంత కష్టపడినా ఏం సుఖం.. వేళకు అన్నం ముద్ద కడుపులో వేయకపోతే.. చాలా మంది.. ఆకలి పక్కన పెట్టి పనులు చేస్తుంటారు. కుదరక కొంతమంది అయితే.. ఇంకొంతమంది కావాలనే భోజనం లేట్‌ చేస్తారు. ఏం టైమ్‌కు చేయాల్సిన పని ఆ టైమ్‌కు చేయాల్సిందే. సరిగ్గా భోజనం చేయకపోయినా.. ఆకలిగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్స్‌ తిన్నా మెటబాలిజం దెబ్బతింటుంది. దీర్గకాలంలో ఇది విటమిన్ల లోపానికి దారితీస్తుంది. ముఖ్యంగా బీ12, డీ3 విటమిన్లు, జింక్ ఆరోగ్యకరమైన రుతు చక్రానికి అత్యంత అవసరం.

పోషకాల లోపం  

విటమిన్ల లోపం ఉన్నప్పుడు కేవలం సప్లిమెంట్లు, మందులపై ఆధారపడడం సరిపోదు... పోషకాల లోపాన్ని సమతుల ఆహారం ద్వారా నివారించాలి. అంటే పోషకాలు దండిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్ల లోపం ఉందని మీకు అనిపిస్తే మీ వైద్యుడిని సంప్రదించి కారణాలు తెలుసుకోండి. అవసరమైన సలహాలు తీసుకోండి. తగిన విధంగా డైట్ మార్చుకోండి.

పండ్లు, కూరగాయల అస్సలు తినకపోవడం.. 

పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోకపోవడం కూడా తప్పే.. పోషకాలు దండిగా ఉండే వీటిని తీసుకుంటే హార్మోనల్ సమస్యలు తగ్గుతాయి. పేగులో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ మీ సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది రుతు చక్రం సవ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఫైబర్‌తో సహా పోషకాలు కలిగి ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం మరిచిపోవద్దు. యోగర్ట్, ఉసిరి చట్నీ వంటి ప్రొబయోటిక్ గల ఆహారం కూడా ప్రయోజనకరమే.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.