Hair fall shampoo : ఎలాంటి జుట్టు సమస్యలున్నా..ఈ షాంపుతో అన్నీ మాయం..!

Homemade shampoo : మీరు మీ ఇంట్లో త‌యారు చేసుకున్న ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూ ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీంతో పైన తెలిపిన జుట్టు స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. చుండ్రు త‌గ్గుతుంది. మ‌రి ఆ స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Hair fall shampoo : ఎలాంటి జుట్టు సమస్యలున్నా..ఈ షాంపుతో అన్నీ మాయం..!
Shampoo for hair fall


shampoo for hair fall : జుట్టుకు పెట్టే ఆయిల్‌, షాంపూ వల్లే జుట్టు సమస్యలు పోతాయి.. ఇందులో తప్పు చేస్తే.. కొత్త సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడం, చుండ్రు, తలలో పేలు, వెంట్రుకలు చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆయిల్‌, షాంపూ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీట‌న్నింటికీ ఒకే ఒక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూతో చెక్ పెట్ట‌వ‌చ్చు. అవును.. మార్కెట్‌లో ల‌భించే ర‌సాయ‌నాలు క‌లిసిన షాంపూల‌ను వాడ‌డం క‌న్నా.. మీరు మీ ఇంట్లో త‌యారు చేసుకున్న ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూ ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీంతో పైన తెలిపిన జుట్టు స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. చుండ్రు త‌గ్గుతుంది. మ‌రి ఆ స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉసిరి కాయ‌లు, కుంకుడు కాయ‌లు, శీకాకాయ‌లు.. ఇవి జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటినీ త‌గ్గించేస్తాయి. ఉసిరికాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. దెబ్బ‌తిన్న శిరోజాలు తిరిగి పున‌రుజ్జీవం పొందుతాయి. కుంకుడు కాయ‌లు కూడా శిరోజాల సంర‌క్ష‌ణ‌కు బాగానే ప‌నిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. దీంతో జుట్టు దెబ్బ తిన‌డం త‌గ్గుతుంది.

శీకాకాయ‌లో అధిక మోతాదులో విట‌మిన్ సీ ఉంటుంది. ఇది చుండ్రును త‌గ్గిస్తుంది. శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. శిరోజాల‌కు కాంతిని అందిస్తుంది. దీంతో శిరోజాలు చిట్లిపోకుండా ఉంటాయి.
ఈ మూడింటినీ క‌లిపి షాంపూను త‌యారు చేసుకుని వాడితే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ షాంపూను ఎలా త‌యారు చేయాలంటే..
కుంకుడు కాయ‌లు, శీకాకాయ‌లు, ఎండ‌బెట్టిన ఉసిరికాయ‌లు లేదా పొడిని తీసుకోవాలి. గుప్పెడు చొప్పున కుంకుడు కాయ‌లు, 8 నుంచి 10 శీకాకాయ‌లు, గుప్పెడు ఎండిన ఉసిరికాయ‌ల‌ను తీసుకోవాలి. అన్నింటినీ రాత్రి నీటిలో వేసి నాన‌బెట్టండి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ నీటిని మ‌రిగించాలి. త‌రువాత గోరువెచ్చగా అయ్యాక.. బ్లెండ‌ర్‌లో వేసి మిశ్ర‌మంగా చేయండి. ఆ త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టాలి. దీంతో వ‌చ్చే చిక్క‌ని ద్ర‌వాన్ని షాంపూలా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు త‌ల‌కు రాయాలి. త‌రువాల గంట సేపు ఉండి త‌ల‌స్నానం చేయాలి. వారంలో క‌నీసం 2 సార్లు చేసినా చాలు, జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.