ఇది తాగితే లివర్‌ మొత్తం క్లీన్‌ అవుతుంది తెలుసా..?

కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం కామ్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం.. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, మాన‌సిక ఒత్తిడి,

ఇది తాగితే లివర్‌ మొత్తం క్లీన్‌ అవుతుంది తెలుసా..?


కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం కామ్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం.. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, మాన‌సిక ఒత్తిడి, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లు కాలేయం మీద తీవ్ర దుష్ప్ర‌భావాల‌ను చూపిస్తున్నాయి. కాలేయ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెల్లుల్లి ఉండే ఎంజైమ్‌లు కాలేయంలోని వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

Weight loss can help head off lasting damage caused by fatty liver -  Harvard Health

వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుపడుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ట్రై గ్లిజ‌రాయిడ్స్ కూడా అదుపులో ఉంటాయి. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తేనెతో క‌లిపి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిని వీలైనంత ఎక్కువ‌గా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో గ్రీన్ టీ ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ప్ర‌తిరోజూ గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల కాలేయంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

రోజూ 2 లేదా 3 క‌ప్పుల కంటే ఎక్కువ‌గా ఈ గ్రీన్ టీని తాగొద్దు. కాలేయంలోని వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు కూడా తొల‌గిపోతాయి. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. 

కాలేయ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ ప‌సుపును వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని గ్లాస్‌లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత తాగాలి. ఇలా త‌యారు చేసుకున్న ప‌సుపు నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోయి కాలేయం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. 

ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. కాలేయం ప‌నితీరు వేగవంతం అవుతుంది. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. సమస్య ఉంటే ట్రై చేసి చూడండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.