జంక్ ఫుడ్ తో పిల్లల ఆరోగ్యం అప్సెట్ అయిందా.. ఇలా చేయండి. 

చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వారికి త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చుట్టూ ఉండే కలుషిత ఆహార పదార్థాలు వాతావరణం వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది..

జంక్ ఫుడ్ తో పిల్లల ఆరోగ్యం అప్సెట్ అయిందా.. ఇలా చేయండి. 


Children's Health : చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వారికి త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చుట్టూ ఉండే కలుషిత ఆహార పదార్థాలు వాతావరణం వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.. అలాగే మారిపోతున్న జీవనశైలితో పాటు పెద్దవాళ్లు కూడా పిల్లలకి తాము ఏది తింటే అది ఇవ్వడం అలవాటు చేస్తూ ఉంటున్నారు.. అయితే పెద్ద వాళ్లతో పోలిస్తే చిన్నపిల్లలు ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ప్రధానంగా బయట జంక్ ఫుడ్ ని తీసుకున్నప్పుడు పిల్లల పొట్ట అప్సెట్ అవుతుంది. ఇలాంటి తప్పకుండా సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ఎప్పుడూ పిల్లల రోగ నిరోధక శక్తి పెద్దవాళ్లకన్నా తక్కువగా ఉంటుందని గుర్తించాలి. అలాగే పెద్దవారు ఏం తింటే అవి పిల్లలకు పెట్టడం సరికాదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ పెద్దవారిలా ఉండదు. అందుకే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి వారికి ఇచ్చినప్పుడు వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ముఖ్యంగా ఇలా బయట తిండి వాళ్ళ వారి ఆరోగ్యం చెడిపోయినప్పుడు.. వారిని వేపుళ్ళు, మసాలాలకు వారిని దూరంగా ఉంచాలి.. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ను ఇవ్వాలి.. వాంతులు అవుతూ ఉంటే వారికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి.. అలాగే కూరగాయలను మెత్తగా ఉడికించి అన్నంలో కలిపి తినిపించాలి..

అన్ని రకాల కాయగూరలు కలిపి సూప్ లా చేసి తాగిపించిన ప్రయోజనం ఉంటుంది.. అలాగే ఇలాంటి సందర్భంలో పాలు కానీ పాలకు సంబంధించిన ఎలాంటి ప్రొడక్ట్స్ పిల్లలకి అందించకూడదు.. తేలిక పాటి జీర్ణమయ్యే పదార్థాలు మాత్రమే ఇవ్వాలి.. కొద్దికొద్దిగా ఆహారాన్ని ఎక్కువసార్లు ఇవ్వాలి.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.. ఈ సమయంలో వారికి ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. కూల్ డ్రింక్స్, పెరుగు వంటి వాటికి దూరం చేయాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.