Sleeplessness : నిద్రలేకపోతే మనిషి స్వార్థపరుడు అవుతాడంటున్న అధ్యయనం..!!

Sleeplessness : మనిషికి నిద్రలేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి.. ఆందోళన, ఒత్తిడి కారణంగా..రాత్రుళ్లు నిద్రపట్టదు.. అలానే నిద్రలేకుండా ఉంటే ఆ ఒత్తిడి, ఆందోళన ఇంకా ఎక్కువ అవుతాయి.. ముఖం పాడువుతుంది. జుట్టు రాలిపోతుంది

Sleeplessness  : నిద్రలేకపోతే మనిషి స్వార్థపరుడు అవుతాడంటున్న అధ్యయనం..!!


Selfish Sleep : మనిషికి నిద్రలేకపోతే... ఎన్నో సమస్యలు వస్తాయి.. ఆందోళన, ఒత్తిడి కారణంగా..రాత్రుళ్లు నిద్రపట్టదు.. అలానే నిద్రలేకుండా ఉంటే... ఆ ఒత్తిడి, ఆందోళన ఇంకా ఎక్కువ అవుతాయి.. ముఖం పాడువుతుంది. జుట్టు రాలిపోతుంది. రోజంతా నీరసంగా ఉంటారు. ఏ పని మీద ఆసక్తి ఉండదు. ఇంకా ఇదే పరిస్థితి ఎక్కువైతే.. మధుమేహం, బీపీ కూడా పెరుగుతుంది. ఇవే మనకు ఇప్పటి వరకూ తెలుసు.. కానీ నిద్రలేమి మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుందని మీకు తెలుసా..? ఇదేంటి కొత్తగా ఉందా అనుకుంటున్నారా..? తాజాగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేలింది..!

ప్రపంచంలో నిద్రకు సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. నిద్రలేమి మనిషిని స్వార్థపరుడిని చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. PLOS బయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం.. నిద్రలేని రాత్రులు వ్యక్తిని స్వార్థపరులుగా మార్చగలదని చూపిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నిద్ర సరిగా లేని వ్యక్తి వ్యక్తిత్వంలో అత్యంత ముఖ్యమైన మార్పు స్వార్థం అని చెబుతున్నారు. 
బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ నిద్రతో, ఇతరులకు సహాయం చేయాలనే మీ కోరిక, సుముఖతను మీరు ఉపసంహరించుకోవచ్చని అధ్యయనాలు చూపించాయి. నిద్రలేమి వ్యక్తి భావోద్వేగ స్థితిని మారుస్తుందట. ఇది సామాజిక పరిస్థితులలో ఒక వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. 

పరిశోధన ఎలా జరిగిందంటే..

తక్కువ నిద్ర ఒక వ్యక్తి మానసిక, శారీరక శ్రేయస్సుకు హాని కలిగించడమే కాకుండా, వ్యక్తుల మధ్య సంబంధాలను కూడా ప్రమాదంలో పడేస్తుందట.
పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజర్(ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ)ని ఉపయోగించి రాత్రిపూట నిద్రపోని 24 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్ల మెదడులను పరిశీలించారు. నిద్రలేమి వారిని ఎలా ప్రభావితం చేస్తుందో కనుగొన్నారు. దీని ద్వారా ఇతరుల బాధలకు సహాయం చేయడం లేదా ఇతరుల బాధల పట్ల సానుభూతి చూపడం పట్ల నిద్రలేనివారికి పెద్దగా ఆసక్తి లేదని తేలింది. వారు తమ స్వంత ఆలోచనలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, మరింత స్వార్థపూరితంగా ఉంటారని పరిశోధనల్లో తేలింది.
నిద్ర లేకపోవడం వల్ల సమాజానికి దూరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఇతరులతో కలిసిపోయే.. సామర్థ్యాన్ని అణిచివేస్తుందని, మనల్ని ఒంటరిగా భావించేలా చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఏడు గంటల నిద్ర మనిషిని ఎంత ఆగం చేస్తుందో.. అర్థమైంది కదా.. రాత్రుళ్లు త్వరగా నిద్రపోయి.. ఉదయం త్వరగా లేస్తే.. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎన్ని పనులు అయినా చేసుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.