Papaya : అందానికి ఆరోగ్యానికి చక్కటి పరిష్కారం బొప్పాయి..

Papaya పండులో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ వంటి పోషకాలు అధికమనే చెప్పాలి. విటమిన్ ఏ, ఇ వంటివి ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

Papaya : అందానికి ఆరోగ్యానికి చక్కటి పరిష్కారం బొప్పాయి..
papaya benefits


 Papaya పండులో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ వంటి పోషకాలు అధికమనే చెప్పాలి. విటమిన్ ఏ, ఇ వంటివి ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

బొప్పాయి పండులో ఉండే పపాయిన్ అనే ఎంజాయ్ జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే బొప్పాయి పండును తరచు తీసుకోవడం వల్ల ఆకలి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆకలి లేకుండా అనిపించేవారు దీనిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి పండు గాయాలని మానపటంలో కూడా సహాయపడుతుంది. చిన్న చిన్న గాయాల నుంచి ఆపరేషన్ గాయాలకు సైతం బొప్పాయి పండు గుజ్జును రాయటం వల్ల తొందరగా మానిపోతుందని తెలుస్తోంది. కాల్షియం, పొటాషియం, సోడియం వంటివి కూడా బొప్పాయి పండులో ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా బొప్పాయిని తీసుకోవచ్చు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసే శక్తి బొప్పాయి పండుకుంది. చిన్నపిల్లల నుంచి మలి వయసు వారి వరకు ఎలాంటి వారైనా బొప్పాయి పండును  తీసుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా కూడా ఇది కాపాడటంలో ముందుంటుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి చర్మానికి నిగాదింపును ఇస్తుంది. గుండె జబ్బులు, బహిష్టు వ్యాధుల్లో సైతం బొప్పాయి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

తరచూ బొప్పాయిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మవ్యాధులు ఉన్నవారు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిర్జీవంగా మారిన చర్మానికి బొప్పాయి నిగారింపుని ఇస్తుంది. మొహం పై ముడతలు మచ్చలు వంటివి ఉన్నవారు బాగా పండిన బొప్పాయి గుజ్జును రాసుకోవడం వల్ల తొందరలోనే అవన్నీ మానిపోతాయి.

బరువు తగ్గాలి అనుకున్న వారు సైతం ఆహారానికి బదులుగా ఏదో ఒక పూట బొప్పాయి పండును తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలని అందుతాయి తేలికగా బరువు తగ్గిపోతారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.