బ్లడ్‌ క్యాన్సర్‌పై మీకూ ఇలాంటి అపోహలు ఉన్నాయా..?

క్యాన్సర్‌లో మనకు కావాల్సిన అన్ని రకాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్ట్‌కు ఎఫెక్ట్‌ అవుతుందో తెలియదు. అయితే చాలా మంది వాస్తవాలు కంటే అపోహలనే ఎక్కువగా నమ్ముతారు. అందులోనే బతికేస్తుంటారు. బ్లడ్‌ క్యాన్సర్‌ గురించి కూడా చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్‌ అనేది ప్రాణాంతకం అని, ఇది అంటువ్యాధి అని కేవలం వృద్ధులకు మాత్రమే ఇది వస్తుంది ఇలా చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఈ అపోహలు వెనకున్న వాస్తవాల గురించి చూద్దాం.  

బ్లడ్‌ క్యాన్సర్‌పై మీకూ ఇలాంటి అపోహలు ఉన్నాయా..?


క్యాన్సర్‌లో మనకు కావాల్సిన అన్ని రకాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్ట్‌కు ఎఫెక్ట్‌ అవుతుందో తెలియదు. అయితే చాలా మంది వాస్తవాలు కంటే అపోహలనే ఎక్కువగా నమ్ముతారు. అందులోనే బతికేస్తుంటారు. బ్లడ్‌ క్యాన్సర్‌ గురించి కూడా చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్‌ అనేది ప్రాణాంతకం అని, ఇది అంటువ్యాధి అని కేవలం వృద్ధులకు మాత్రమే ఇది వస్తుంది ఇలా చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఈ అపోహలు వెనకున్న వాస్తవాల గురించి చూద్దాం.  
బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధి అని చాలా మంది అనుకుంటారు. ఇది అంటువ్యాధి కాదు. లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి రక్త క్యాన్సర్లు, రక్త కణాలు లేదా ఎముక మజ్జలో జన్యు ఉత్పరివర్తనాల కారణంగా అభివృద్ధి చెందుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్స్ నుంచి సంభవించదు.
 
బ్లడ్ క్యాన్సర్ వృద్ధులని మాత్రమే కాదు అన్ని వయసుల వారిని రావొచ్చు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీర్ఘకాలిక లింఫోసైటిక్ లుకేమియా వంటివి పెద్దవారిలో కనిపిస్తుంది. దీని వల్ల ఎవరైనా ప్రమాదంలో పడతారు.
Blood cancer symptoms: The simple finger test that could identify the  deadly disease | Express.co.uk
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు అలసట, బరువు తగ్గడం, రాత్రి చెమటలు, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు అవుతాయి. ఈ లక్షణాలు ఇతర పరిస్థితుల వల్ల కూడా రావొచ్చు. ఖచ్చితమైన రోగనిర్ధారణ కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులని సంప్రదించడం ముఖ్యం.
బ్లడ్ క్యాన్సర్ తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి అని అందరూ అంటుంటారు. అయినప్పటికీ చికిత్స తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. రోగనిర్ధారణ సరైన చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.
బ్లడ్ క్యాన్సర్లు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో రకాలు, లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లుకేమియా, లింఫోమా, మైలోమా(ప్లాస్మా కణాలని ప్రభావితం చేస్తుంది) రకాలు. రకాన్ని బట్టి చికిత్స ఇస్తారు.
రక్తదానం వల్ల బ్లడ్ క్యాన్సర్ రాదు. నిజానికి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంకా మేలు జరుగుతుంది. అత్యవసరంలో ఉన్న వ్యక్తుల ప్రాణాలని కాపాడేందుకు సహాయపడుతుంది.
కొంతవరకు నొప్పి ఉంటుంది. ఇక జుట్టు రాలడం అనేది కీమోథెరపీ సాధారణ దుష్ప్రభావం. అయితే ఇది అందరికీ జరగకపోవచ్చు. శాశ్వతంగా జుట్టు రాకుండా ఉంటుందనేది అపోహ మాత్రమే.
బోన్ మ్యారో దానం చేయడం అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఇది బాధాకరమైనది కాదు. ఈ ప్రక్రియ కోసం దాతలను సిద్ధం చేస్తారు.
ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్సుని ఇస్తుంది. చికిత్స సమయంలో కొన్ని ఆహారాలు మంచి చేయవచ్చు. అయితే బ్లడ్ క్యాన్సర్‌ని నయం చేసే నిర్ధిష్ట ఆహారం ఏమి లేదు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెట్డ్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి చికిత్సల ద్వారా తగ్గించుకోవచ్చు. వ్యాధి తగ్గడం లేదా పునరావృతం అవడం అనేది చికిత్స మీద ఆధారపడి ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.