నిజమే.. పిల్లల వల్ల భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి.. ఈ విషయంపై మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..!

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య పిల్లల లేకపోవడం. అయితే పిల్లలు పుట్టక ఎంతోమంది మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

నిజమే.. పిల్లల వల్ల భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి.. ఈ విషయంపై మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..!
Relationships


ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య పిల్లల లేకపోవడం. అయితే పిల్లలు పుట్టక ఎంతోమంది మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో బిడ్డ పుట్టినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే చాలా వరకు భార్యాభర్తలు పెళ్లయిన వెంటనే పిల్లలు వద్దని కూడా అనుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి అంటే..

పెళ్లి అనంతరం కొన్నాళ్లపాటు పిల్లల్ని వద్దనుకోవడం సాధారణమైన విషయమే. అయితే జీవితకాలం పాటు కూడా పిల్లలు వద్దని అనుకునే జంటల సంఖ్య పెరిగిపోవడం ఒకరకంగా విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక విధంగా ఉన్నాయి.

చాలామంది భార్య భర్తలు పిల్లలు పుట్టినా అనంతరం కలిగిన ఆనందం కొంతకాలమేనని.. కానీ అనంతరం భార్యాభర్తల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉందని చెప్పాలి.

పిల్లలు పుట్టినానంతరం ప్రేమను మొత్తం వారికే పంచి ఇవ్వడం వల్ల వారి బాధ్యతల్లో మునిగిపోవడం వల్ల భార్యాభర్తలు ఒకరికొకరు కేటాయించుకున్న సమయం పూర్తిగా తగ్గిపోతుందని దీని వలన మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని పలు రకాల జంటలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

పెళ్లయి పిల్లలు ఉన్న జంటలతో పోలిస్తే పిల్లలు లేని జంటలు మరింత ఆనందంగా ఉన్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. అంతేకాకుండా బిడ్డ పుట్టిన పదేళ్లలో క్రమంగా వారి మధ్య ప్రేమ తగ్గిపోతూ వస్తుందని కూడా చెబుతున్నారు మానసిక నిపుణులు.

అంతేకాకుండా బిడ్డ పుట్టిన అనంతరం తల్లి తండ్రి ఇద్దరు కూడా మానసికంగా కొంత డిప్రెషన్ కు గురవుతారని ఇది ఉమ్మడి కుటుంబాల్లో తక్కువగా ఉంటుందని కానీ చిన్న కుటుంబాలు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో బిడ్డను చూసుకోవటానికి అందరూ ఉంటారు. కానీ చిన్న కుటుంబాలలో భార్యాభర్త ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల బిడ్డ పెంపకంలో సరైన అవగాహన లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మొదటిసారి తల్లిదండ్రు అయిన జంటకు ఈ సమస్య మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. అయితే పిల్లల పెంపకంలో అత్త మామ తల్లి తండ్రి సలహాలు తీసుకోవడం వల్ల పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.