పిల్లలు కలగట్లేదా?...మరి దానికి కారణం

మాతృత్వం లేక బాధపడే స్ర్రీలేందరో... పెళ్లి అయిన మహిళ...తల్లి కాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. సంతానోత్పత్తి కోసం వైద్యులను కలిసినంత మాత్రాన మనలో ఏదో లోపమున్నట్లు కాదు. అది ఒక్కొక్కరి శరీర తత్వాలు ఒక్కోలా ఉంటాయి. దానివల్ల కొందరికి త్వరగా పిల్లలు కలగొచ్చు. మరికొందరకి ఏళ్లు పట్టొచ్చు. అంతమాత్రాన బాధపడనక్కర్లేదు.

పిల్లలు కలగట్లేదా?...మరి దానికి కారణం
FERTILITY PROBLEMS AND CAUSES


FERTILITY PROBLEMS : మాతృత్వం అనేది ఒక అనుభూతి. వివాహం అయిన ప్రతి మహిళ కోరుకున్న ఓ గొప్ప వరం. భర్త ఎలాంటి వాడైనా తన పిల్లలు తనకుంటే చాలనకుంటుంది. అది మాతృత్వానికి ఉన్న గొప్ప శక్తి. 

కానీ కొందరికీ మాత్రం అది శాపంగా మారుతోంది. మాతృత్వం లేక బాధపడే స్ర్రీలేందరో... పెళ్లి అయిన మహిళ...తల్లి కాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇంట్లో అత్తమామల సూటిపోటి మాటలు, భయటవారి ఎత్తిపొడుపులు. అవన్నీ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే తల్లి కాలేని తల్లులెందరో. 

పిల్లలు పుట్టకపోతే ఆ దంపతుల మనోవేదన అంతాఇంతా కాదు. ఎందుకు పిల్లలు పుట్టడం లేదో అర్థం కాదు. వైద్యుల దగ్గరకు వెళ్తే ఎవరెమనుకుంటారో అనే భయం. సంతానోత్పత్తికి చికిత్స ఉందని చాలామందికి తెలియదు కూడా. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. కానీ వాళ్లకు తెలియనిది ఏంటంటే.....ఒత్తిడి, ఆందోళన పెరిగినా కూడా హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయని. 

కాబట్టి ఏ సమస్యకు చింతించకూడదు. సంతానోత్పత్తి కోసం వైద్యులను కలిసినంత మాత్రాన మనలో ఏదో లోపమున్నట్లు కాదు. అది ఒక్కొక్కరి శరీర తత్వాలు ఒక్కోలా ఉంటాయి. దానివల్ల కొందరికి త్వరగా పిల్లలు కలగొచ్చు. మరికొందరకి ఏళ్లు పట్టొచ్చు. అంతమాత్రాన బాధపడనక్కర్లేదు.

ముందు ధైర్యంగా సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లండి. నిపుణులను కలిసి పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులోనే సంతానోత్పత్తి కేంద్రాలు ఉంటున్నాయి. వాళ్లు కూడా దంపతులు ఇద్దరికీ పరీక్షలు చేస్తారు. దానివల్ల మీలో సమస్య ఏంటో గుర్తిస్తారు. అందుకు తగ్గ చికిత్స అందిస్తారు. చికిత్స కోసం ఎలాంటి సందేహాలున్నా.....క్షుణ్ణంగా వివరిస్తారు. కాబట్టి ఆందోళన చెందనక్కర్లేదు.

ఇంకో విషయం ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవనశైలి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మన జీవనశైలి ఎలా ఉందో గమనించుకోవాలి. ఆహార అలవాట్లు కచ్చితంగా మార్చుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళలు రుతుచక్రం సరిగ్గా జరుగుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ రుతుచక్రం గాడితప్పితే వైద్యుల్ని సంప్రదించాలి. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

పిల్లలు పుట్టకపోవడానికి కొన్ని కారణాలు

  • మగవాళ్లు ఎక్కువగా సెల్ ఫోన్లు ప్యాంట్ జేబులో పెట్టుకోవడం. దానివల్ల మర్మాంగం రేడియేషన్ ప్రభావానికి గురై స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది
  • సిగరేట్, మందు తాగడం వల్ల పురుషుల్లో హార్మన్లు అసమతుల్యతకు గురి అవుతాయి.  
  • ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల శరీరం రేడియేషన్ కు గురి అవుతుంది
  • లేటుగా పడుకోవడం, ఆహార సమయాలు మారడం,  
  • వీర్య కణాల ఉత్పత్తిలో సమస్య, లైంగిక పటుత్వం లేకపోవడం
  • జన్యపరమైన లోపాలు, వంశపారంపర్యంగా ఉండే సమస్యలు
  • ఆందోళన, ఒత్తిడి, ఊబకాయం  .
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.