నడుంనొప్పా? భయమెందుకు....ఇలా చేయండి

అప్పుడప్పుడు ఇంట్లో గానీ, ఆఫీస్ లో గానీ పని ఎక్కువైనా నడుం నొప్పిగా అనిపిస్తుంది. ఉపశమనం కోసం ఏవేవో ట్యాబ్లెట్లు వేసేస్తుంటాం. ఆ నొప్పి మహా అయితే గంట పాటు ఉండకపోవచ్చు. కానీ యథావిధిగా మళ్లీ బాధపడుతుంటాం.

నడుంనొప్పా? భయమెందుకు....ఇలా చేయండి
Solution for back pain


ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య backache. ఈ backache ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొందరికీ చిన్నపాటి నొప్పి మాత్రమే ఉంటుంది. మరికొందరికీ అక్కడ ఏమైనా తాకినా కూడా మంటగా అనిపిస్తుంది. మంటగా వచ్చే నొప్పి వల్ల పడుకోలేము, వెల్లకిలా పడుకున్నా కూడా తట్టుకోలేము, అదేవిధంగా నిల్చున్నా, పనిచేస్తున్నా నరాలు మెలెసేంతలా నొప్పి వచ్చేస్తుంది.

 అప్పుడప్పుడు ఇంట్లో గానీ, ఆఫీస్ లో గానీ పని ఎక్కువైనా back pain గా అనిపిస్తుంది. ఉపశమనం కోసం ఏవేవో ట్యాబ్లెట్లు వేసేస్తుంటాం. ఆ నొప్పి మహా అయితే గంట పాటు ఉండకపోవచ్చు. కానీ యథావిధిగా మళ్లీ బాధపడుతుంటాం.

 ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు సరిగ్గా కూర్చోకపోయినా కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. పొలాల్లో పనిచేసే మహిళలను కూడా నడుంనొప్పి బాధిస్తోంది. కారణం రోజంతా నడుం వంచి పనిచేయడం. అప్పట్లో మంచి ఆహారం తినేవాళ్లు కాబట్టి ఎంత కష్టమైన పనులు చేసినా ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆహార పద్ధతులు మారిపోవడంతో.....సకల రోగాలకు మన శరీరం నిలయంగా మారింది.

స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా నడుంనొప్పి అంటుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. దానికీ కారణం లేకపోలేదు. కేజీల బరువున్న పుస్తకాల సంచులు మోయడంతో చిన్న వయసులోనే వెన్ను వంగిపోతుంది. దీనిని పాఠశాల యాజమాన్యం ఆలోచించాలి. పోనీ మంచి ఆహారం ఏమన్నా తీసుకుంటారా అంటే అదీ లేదు. ఉదయం ఏదో ఒకటి తినాలి కదా అనే కంగారులో కంటికి కనిపించిన ఆహారం పెట్టేస్తున్నారు. అలా కాకుండా రోజు పొద్దున్నే చిరుధ్యాన్యాల ఇడ్లీలు, అంబలి, క్యారెట్, బీట్ రూట్, గుడ్లు, పాలు వంటివి ఆహారంలో చేర్చితే శక్తికి శక్తి ఉండవు. ఎలాంటి విటమిన్ లోపాలు దరిచేరవు. ఆరోగ్యంగా ఉంటారు.

 

 కొందరికి చిన్నవయసులోనే శక్తికి మించి ఇంటిపనులు చేయడం వల్ల ఎక్కువగా అలసిపోయి శ్వాస అతిగా పీల్చడంతో వెన్నుపూసలో గాలి చొరబడి నొప్పిగా అనిపిస్తుంది. దాన్ని అశ్రద్ధ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మంచి వయసులో ఉన్నప్పుడు నిల్చుని ఏ చిన్న పనిచేసినా నొప్పితో విలవిలలాడిపోతారు. అలాంటి వాటిని ముందే గమనించి సరైన మందులు, వ్యాయామాలు చేస్తూ ఉంటే.....నడుంనొప్పిని మాయం చెయోచ్చు.

 

నడుం నొప్పిని తరిమికొట్టడేమెలా

  • కరోనా ప్రారంభం నుంచి కొద్ది కొద్దిగా ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి.
  • నడుముకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
  • తినే ఆహారంలో ఎక్కువుగా అన్నానికి బదులు చపాతీలు, రాగులు, సజ్జలు, పప్పులు, చేపలు, గుడ్లు చేర్చుకోవాలి

          దానివల్ల ఎముకలు గట్టిగా తయారవుతాయి.

  • అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్....నడక, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది , ఎదో ఒక పనిపెట్టుకుని నడుస్తూ ఉండాలి.

 

ఎన్ని చేసినా నడుం నొప్పి తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాలి, ఎక్స్ రేలు, స్కానింగ్ చేయించుకోవాలి, దానికి సంబంధించి మందులు వాడాలి. అవసరమైతే ఎంత వీలేతే అంత విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.