Liver problems : కాలేయం ఇబ్బందులో పడటానికి కారణాలు ఏంటంటే..

Liver problems : నిజానికి liver చాలా మెత్తగా ఉంటుంది. Liver కి సంబంధించి ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్ బి, మద్యపానం, దూమపానం, రకాల జబ్బులు సోకడంతో liver చెడిపోయే అవకాశం ఉంది. అలాగే లివర్ సిరోసిస్ బారిన పడితే ప్రాణాంతకంగా

Liver problems : కాలేయం ఇబ్బందులో పడటానికి కారణాలు ఏంటంటే..
Reasons for liver problems


Liver problems : శరీరం సక్రమంగా పనిచేయాలి అంటే liver పనితీరు సక్రమంగా ఉండాలి. ఈ పనితీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన శరీరంలో దాదాపు 500 రకాల పనులు ఆగిపోతాయి. ఈ సమయంలో పలు రకాల వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది.. 

కాలేయానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే

శరీరంలో అతి పెద్ద గ్రంధి liver. ఇది పైత్య రసాన్ని విడుదల చేస్తుంది. పిత్తాశయంలో నిల్వ చేయబడిన పైత్యరసం జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. 
నిజానికి లివర్ చాలా మెత్తగా ఉంటుంది. లివర్ కి సంబంధించి ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్ బి, మద్యపానం, దూమపానం, రకాల జబ్బులు సోకడంతో లివర్ చెడిపోయే అవకాశం ఉంది. 
అలాగే లివర్ సిరోసిస్ బారిన పడితే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో లివర్ గట్టిగా రాయిలాగా మారిపోతుంది. కామెర్లు, లివర్ క్యాన్సర్ వంటివి సైతం చాలా ప్రమాదకరం. 
వీటన్నిటి విషయంలో కచ్చితంగా తగిన అవగాహన ఏర్పాటు చేసుకోవాలి.

లివర్ పాడైపోయిన పరిస్థితుల్లో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్ళ వాపులు, రక్తపు వాంతులు వంటివి జరిగి శరీరంలో 500 రకాల పనులు ఆగిపోతాయి.దీని వలన శరీరం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

  • ముఖ్యంగా లివర్ ను సక్రమంగా ఉంచుకోవాలి అంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా మాంసాహారం, మాసాల సంబంధిత పదార్థాలు తీసుకోవడం వల్ల లివర్ పై ప్రభావం ఉంటుంది.
  •  ద్రాక్ష, వెల్లుల్లి, బెర్రీస్, బ్రకోలి, ఆకుకూరలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే టీ, కాఫీ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
  • అన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
  • ఆకుపచ్చ కాయగూరలను, ఆకుకూరలను తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. బయట దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
  • రోజు సక్రమంగా నీటిని తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే లివర్ విషయములో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.