కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు ఇవే.. తీసుకుంటున్నారా మరి..!

ఈ మధ్య కాలంలో పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా కారణంగా... ఆన్లైన్ క్లాసులంటూ స్మార్ట్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడ్డారు. దాంతో గంటల తరబడి మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉండిపోతున్నారు. ఈ కారణంగా చిన్నారుల కళ్లు ఎర్ర బడటం, చూపు మందగించడం, చిన్న వయసులోనే కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కేవలం ఔషధాలతోనే కాకుండా

కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు ఇవే.. తీసుకుంటున్నారా మరి..!


ఈ మధ్య కాలంలో పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా కారణంగా... ఆన్లైన్ క్లాసులంటూ స్మార్ట్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడ్డారు. దాంతో గంటల తరబడి మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉండిపోతున్నారు. ఈ కారణంగా చిన్నారుల కళ్లు ఎర్ర బడటం, చూపు మందగించడం, చిన్న వయసులోనే కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కేవలం ఔషధాలతోనే కాకుండా సహజ సిద్ధంగా ఆహార పదార్థాల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. మరి... ఏ ఆహారంలో ఎలాంటి ప్రయోజనం ఉందో తెలుసుకోండి.. 

క్యారెట్: చిన్నారుల కంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే క్యారెట్ మంచి ఎంపిక. క్యారెట్లో విటమిన్-సీ అధికంగా ఉంటుంది. అలాగే.. విటమిన్ బి, కె, సి6 కూడా లభిస్తాయి. పైగా క్యారెట్లో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
బత్తాయి, కమలా: విటమిన్-సీ0 పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి, కమలా పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. కాబట్టి.. చిన్నారులు రోజులో కనీసం ఒక పండునైనా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాని వల్ల కంటి సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. 
ఉసిరి: విటమిన్-సీ సమృద్ధిగా ఉన్న మరో పదార్థం ఉసిరి. దీనిని రోజుకు ఒకటి చప్పున తీసుకుంటే పిల్లలు, పెద్దలలో కంటి సమస్యలు, జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుంది.
బచ్చలి కూర: చలికాలంలో అధికంగా లభించే బచ్చలి కూరలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కంటి నాడిని మెరుగుగా ఉంచుతుంది. పలుచని పప్పులో బచ్చలికూర వేసి వండితే పిల్లలు ఇష్టంగా తింటారు.
స్వీట్ పొటాటో: బీటా కెరోటిన్, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. బీటా కెరోటిన్ కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ బి6 ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.