స్కిన్‌ టైట్‌గా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి..100% రిజల్ట్‌

యవ్వనం కొన్ని నాళ్లే..ఆ తర్వాత అన్నీ షెడ్డుకు వచ్చిన సెకండ్‌ హ్యాండ్‌ బండ్లే అవుతాయి. కానీ ఈ వాస్తవాన్ని నేడు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ స్లిమ్‌గా, ముడతలు లేకుండా ఉండాలని చాలా ప్రయత్నాలు

స్కిన్‌ టైట్‌గా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి..100% రిజల్ట్‌


యవ్వనం కొన్ని నాళ్లే... ఆ తర్వాత అన్నీ షెడ్డుకు వచ్చిన సెకండ్‌ హ్యాండ్‌ బండ్లే అవుతాయి. కానీ ఈ వాస్తవాన్ని నేడు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ స్లిమ్‌గా, ముడతలు లేకుండా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా అనుకోవడం తప్పు లేదు. కానీ మీరు 30 దాటక కూడా అందంగా ఉండాలని.. ఆ వయసు వచ్చాకే ప్రయత్నాలు స్టాట్ చేస్తే లాభం లేదు. ఇప్పటినుంచే మంచి పోషకాలు ఉన్న ఆహారం, స్కిన్‌ కేర్‌ తీసుకుంటే ఎప్పటికీ అలా ఉండొచ్చు. 50sలో కూడా 18లో ఉన్నట్లు ఉంటున్నారు.
Skin whitening injections in Korea - What are their effects? - Jivaka Beauty
అంటే ఇది అసాధ్యం అయితే కాదు కదా..! ముఖ్యంగా స్కిన్‌ టైట్‌గా ఉంటే మీ వయసు తక్కువగా కనిపిస్తుంది. స్కిన్‌ టైట్‌గా ఉండాలంటే తాడుపెట్టి కట్టేయలేం కదా..! కానీ కొన్ని ఆహారాలు, చిట్కాలు పాటిస్తే నిజంగానే తాడుతో కట్టేసినట్లు అవుతుంది..! ఈరోజు మనం స్కిన్‌ టైట్‌గా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా.
గుడ్డులోని తెల్లసొన సహాయంతో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించవచ్చు. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొనను తీసుకుని, కాటన్ బాల్ లేదా బ్రష్ సహాయంతో మీ ముఖం, మెడపై అప్లై చేయండి. 15-20 నిమిషాల పాటు చర్మంపై ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. 
అరటిపండుతో చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చర్మంపై వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. దాని మాస్క్‌ను తయారు చేయడానికి పండిన అరటిపండును మెత్తగా చేసి మీ ముఖంపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీ చర్మం మరింత మృదువుగా మారుతుంది , చర్మంపై మెరుపు కూడా పెరుగుతుంది.
3 Essential Oil Recipes for Skin Whitening - Goodmart
పెరుగు, తేనె మాస్క్ కూడా చర్మం యొక్క పొడిని తొలగిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఒకటి నుండి రెండు చెంచాల పెరుగు తీసుకుని, అందులో కొన్ని చుక్కల తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు దీన్ని మీ ముఖం మెడపై అప్లై చేయండి. నిజానికి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని బిగుతుగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. తేనెలో తేమ పోషణ గుణాలు ఉన్నాయి.
బొప్పాయి మాస్క్ ముఖానికి తక్షణ మెరుపును తీసుకురావడమే కాకుండా, ముఖాన్ని బిగుతుగా ఉంచడం ద్వారా వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి, పండిన బొప్పాయిని తీసుకుని, పేస్ట్‌లా చేయండి. ఇప్పుడు దీన్ని ముఖం మెడపై అప్లై చేయండి. నిజానికి బొప్పాయిలో ఎంజైమ్‌లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి.
 
ఆలివ్, బాదం, కొబ్బరి నూనెల సహాయంతో చర్మంపై వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించవచ్చు. దీని కోసం మీరు చర్మంపై ఈ ముడు నూనెలు కలిపి మసాజ్ చేయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే స్కిన్‌ ఎప్పుడూ బాగుంటుంది. ఇవి చేయడం పెద్ద టైమ్‌ ప్రాసెస్‌ కాదు అలాగే దొరకని అంతేకంటే కాదు కదా.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.