నిద్రపోయే ముందు ఇవి తింటే పీడ కలలు వస్తాయా..!

ప్రతి వ్యక్తికి కలలు రావడం సహజం. దీనికి వయసుతో సంబంధం ఉండదు.  అయితే ఇందులో కొన్ని మంచివి ఉంటాయి. ఇంకొన్ని భయపెట్టేవి ఉంటాయి. ఎక్కువగా భయపెట్టే వాటినే పీడ కలలు అంటారు.  పెద్ద బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతునట్లు

నిద్రపోయే ముందు ఇవి తింటే పీడ కలలు వస్తాయా..!


ప్రతి వ్యక్తికి కలలు రావడం సహజం. దీనికి వయసుతో సంబంధం ఉండదు.  అయితే ఇందులో కొన్ని మంచివి ఉంటాయి. ఇంకొన్ని భయపెట్టేవి ఉంటాయి. ఎక్కువగా భయపెట్టే వాటినే పీడ కలలు అంటారు.  పెద్ద బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతునట్లు, ఎవరో తరుముతున్నట్లు.. ఇలా ఎన్నో రకాల భయపెట్టే కలలూ వస్తుంటాయి. ఇవి నిద్రకు భంగం కలిగించడమే కాకుండా  ఆందోళనలను పెంచుతాయి. అయితే ఇవి మనం తినే తిండి మీద ఆధార పడి వస్తాయట.

Experts on surprising causes of frequent nightmares | Health - Hindustan  Times

అవును  నిజమే.. నిద్రపోయే ముందు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో దాని మీద ఆధార పడి ఉంటుందట. అందుకే నిద్ర ముందు ఏం ఆహారం తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యమట. దాని ప్రభావం మనకొచ్చే కలల మీద  పడుతుందట. మరి నిద్రపోయే ముందు ఏం తినాలి, తినకూడదో చూద్దాం. 

కలలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అంటే.. 

మసాలాలున్న ఆహారం తినడం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కలలు వస్తాయట.

నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఈ ఆల్కహాల్ వల్ల ర్యాపిడ్ ఐ మోవ్‌మెంట్ ఉన్న నిద్ర ఉంటుందట. దీని వల్ల కలలు వచ్చే అవకాశం ఉంటుందట. 

కెఫీన్.. నిద్రకు భంగం కలిగించే వాటిలో ఇది ముందుంటుంది. కెఫీన్ ఉన్న పానీయాలు, కాఫీ, టీ తీసుకోవడం వల్ల నిద్ర పట్టదు. కలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మసాలాలు..కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల టెంపరేచర్ తో పాటు, గుండె వేగం కూడా పెరుగుతుంది. ఇది నిద్ర పట్టనివ్వదు.

పంచదార... ఎక్కువ పంచదార ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల నాణ్యమైన నిద్ర లేక కలలు వస్తాయట.

కొవ్వు..ఎక్కువ కొవ్వుండే ఆహారం నిద్రపోయే ముందు తీసుకుంటే..  సరిగ్గా జీర్ణo కాక అసౌకర్యంతో  నిద్ర కూడా పట్టదు. దానివల్ల కూడా కలలు  ఎక్కువ వస్తాయట.

కలలు రాకుండా ఉండాలంటే ఏం తినాలి....

క్యాల్షియం..  శరీరం ప్రశాంతంగా ఉండటంలో క్యాల్షియం సాయపడుతుంది. పడుకునే ముందు క్యాల్షియం ఎక్కు వుండే పాలు, పెరుగు, చీజ్, ఆకు కూరలు తింటే మంచిది.

కార్బోహైడ్రేట్లు.. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల  కలలు వచ్చే అవకాశం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, చిలగడదుంపలో మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

విటమిన్ బీ6: ఈ విటమిన్ వల్ల శరీరంలో సిరటాయిన్ ఉత్పత్తి అవుతుంది. మంచి నిద్ర వస్తుంది. అందుకే విటమిన్ బి6 ఉండే అరటిపండ్లు, విత్తనాలు, చేపలు  చికెన్, చేపలు, గుడ్లు, గింజలు పడుకునే ముందు తీసుకోవచ్చు.

హెర్బల్ టీ..  నిద్రపోయే ముందు చేమంతి టీ, ల్యావెండర్ టీ తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. నాణ్యమైన నిద్ర అందుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.