కలలో గుడ్లగూబ కనిపిస్తే దరిద్రమా..? కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏంటి అర్థం..?

మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తాయి.. ఆ కలలు జంతువులు, మనుషులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఈ కలలను లైట్‌ తీసుకుంటాం కానీ కొన్నిసార్లు అవి పదే పదే రావడంతో కొంత ఆలోచిస్తాం.

కలలో గుడ్లగూబ కనిపిస్తే దరిద్రమా..? కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏంటి అర్థం..?


మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తాయి.. ఆ కలలు జంతువులు, మనుషులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఈ కలలను లైట్‌ తీసుకుంటాం కానీ కొన్నిసార్లు అవి పదే పదే రావడంతో కొంత ఆలోచిస్తాం.. కలలో వచ్చే ప్రతీదానికి ఒక అర్థం ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు వీటన్నింటికి సమాధానం ఉంది. ఒక వేళ మీకు కలలో ఈ జంతువులు కనిపిస్తే అది శుభమో, అశుభమో చూద్దాం..!

 
డ్రీమ్‌లో రెండు రకాలు ఉంటాయంటున్నారు నిద్ర నిపుణులు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చేవి ఒకరకమైన కలలైతే... భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేవి రెండో రకమైన కలలట. కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతకుమించిన ఆసక్తి కలలపై నెలకొంది. అయినప్పటికీ, జ్యోతిష్కులు, స్వప్న శాస్త్ర నిపుణులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి. కలలో కొన్ని మీకు కనిపిస్తే అది అరిష్టంగా భావిస్తారు. కొందరకి కలలో తరచుగా కొన్ని జంతువులు, పక్షులు సైతం కనిపిస్తాయి. 
ఆవు రూపం కలలో కనిపించిందంటే ఆ వ్యక్తికి దేవుడి పట్ల భక్తి ఉంటుంది. ఆ వ్యక్తి దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవు మీకు కలలో కనిపిస్తే, ఆ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని అర్థం.
కొందరికి కలలో గజరాజు(Elephant) తరచుగా కనిపిస్తుంది. అయితే మీకు కలలో ఏనుగు వస్తే, మీ దశ తిరగనుందని అర్థం. ఏదో విధంగా మీకు ధనలాభం గోచరిస్తుంది. మీరు త్వరగా ధనవంతులు కాబోతున్నారని సంకేతం. లేదా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.
గుడ్లగూబను కొందరు దేవతల వాహనంగా భావిస్తారు. కలలో గుడ్లగూబ కనిపించినట్లయితే, మీకు ధనధాన్యం చేతికి అంది వస్తుంది. కలలో గుడ్లగూబ కనిపిస్తుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించనుందని అర్థమట..
హాయిగా నిద్రిస్తున్నా మీకు కలలో పాము కనిపించిందంటే దెబ్బకి ఉలిక్కిపడి లేస్తారు. కలలో పాము కనిపిస్తే ఏ భయాలు, ఆందోళన అక్కర్లేదు. కలలో పాము కనిపించడాన్ని మంచి శకునమని చెబుతారు. మీరు జీవితంలో విజయం సాధిస్తారని అర్థం. మీరు సురక్షితంగా ఉంటారని సైతం కొందరు పెద్దలు చెబుతారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.