మలబద్దకం... కారణాలు.. పరిష్కారం.. 

ఈ రోజుల్లో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం సమయానికి తినకపోవడం మారిపోతున్న జీవనశైలే ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినటం శరీరం డిహైడ్రేటుకు గురవటం వంటి ఎన్నో

మలబద్దకం...  కారణాలు..  పరిష్కారం.. 
Constipation Symptoms


Constipation : ఈ రోజుల్లో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం సమయానికి తినకపోవడం మారిపోతున్న జీవనశైలే ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినటం శరీరం డిహైడ్రేటుకు గురవటం వంటి ఎన్నో కారణాలు మలబద్దకానికి దారితీస్తున్నాయి.. అలా ఎందరో ఈ సమస్యతో బాధపడుతున్నారు.. ఇవి మాత్రమే కాకుండా మలబద్దకానికి మరిన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. 

నిజానికి తీసుకునే ఆహారం బట్టి మలబద్ధకం సమస్య వస్తూ ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ దీనికి పలు కారణాలు ఉన్నాయి.. ముఖ్యంగా డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, గుండె జబ్బులు, పార్కిన్సోనిజం, స్ట్రోక్, వెన్నుపాము సమస్యలు వంటి రోగాలు కూడా మలబద్దకానికి దారితీస్తాయి.

అలాగే మూత్రపిండాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్న మలబద్ధకం సమస్య దరి చేరుతుంది అలాగే కొందరు ఎక్కువ మందులు వేసుకోవాల్సి ఉంటుంది నిత్యం వాడే బీపీ టాబ్లెట్లు ఐరన్ సప్లిమెంట్స్ వంటివి కూడా ఈ సమస్యకు దారి తీస్తాయి.. అయితే మలబద్ధకంతో పాటు రక్తస్రావం ఒక్కసారిగా బరువు తగ్గటం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలి తీవ్రమైన పొత్తికడుపులో నొప్పి ఉంటే ఏ మాత్రం జాగ్రత్త చేయకూడదు.. 

అయితే ఈ సమస్య ఉన్నవారు ఉదయం లేవగానే కచ్చితంగా ఒక లీటరు గోరువెచ్చని నీటిని తాగాలి రోజు మొత్తంగా వీలైనంత ఎక్కువ నీటిని తీసుకుంటూ ఉండాలి ఉదయాన్నే 8 గంటలకల్లా అల్పాహారాన్ని పూర్తి చేయాలి అలాగే రాత్రి సమయంలో ఏడు గంటలకి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.. అలాగే తిన్నప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినటంతో పాటు ఈ సమయంలో నీటిని ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకూడదు తినడం పూర్తయ్యాక అరగంట అయ్యాక మాత్రమే నీటిని తాగాలి అలాగే రోజు మొత్తంలో వీలైనంత సమయం వ్యాయామానికి కేటాయించాలి.. అన్ని సక్రమంగా చేస్తున్న ఈ సమస్య తగ్గకపోతే మాత్రం కచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాలి ఎందుకు అంటే మలబద్ధకం తీవ్రమైన ఫైల్ సమస్యకు దారితీస్తుంది అందుకే ఇంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.