Male Fertility : పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెంచేందుకు మందార పువ్వుల పొడి బెస్ట్‌ ఆప్షన్‌..!!

Male Fertility : పురుషుల్లో సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం..వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, క్వాలిటీ లేకపోవడం.. ఈరోజు ఈ సమస్యల వల్లే ఎంతో మంది మగవారు తండ్రులు కాలేకపోతున్నారు. ఇది మానసికంగా ఆ జంటను అన్ని విధాలా ఇబ్బంది

Male Fertility : పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెంచేందుకు మందార పువ్వుల పొడి బెస్ట్‌ ఆప్షన్‌..!!


పురుషుల్లో సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం..వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, క్వాలిటీ లేకపోవడం.. ఈరోజు ఈ సమస్యల వల్లే ఎంతో మంది మగవారు తండ్రులు కాలేకపోతున్నారు. ఇది మానసికంగా ఆ జంటను అన్ని విధాలా ఇబ్బంది పెడుతుంది. పురుషుల్లో ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌ద్య‌పాసం, ధూమ‌పానం, అధిక బ‌రువు, మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, శ‌రీరంలో ఉండే అధిక వేడి, ఇన్‌ఫెక్ష‌న్‌ల కార‌ణంగా పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ను నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఆయుర్వేదంలో కూడా అనేక ర‌కాల మార్గాలు ఉన్నాయి.

పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడానికి...

పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో మందార చెట్టు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంట్లో అందం కోసం పెంచుకునే మందార చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య, వాటి నాణ్య‌త పెరుగుతుంది. మందార పువ్వుల‌ను బాగా ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మందార పువ్వుల పొడి మ‌న‌కు ఆయుర్వేద దుకాణాల‌లో కూడా ల‌భ్య‌మ‌వుతుంది. లేదా ఇంట్లో మందార చెట్టు ఉంటే.. పూలను ఎండబెట్టి పొడిగా చేసుకోవచ్చు.. రోజూ రెండు టీ స్పూన్ల పొడిని తిని వెంట‌నే ఒక గ్లాస్ పాల‌ను తాగాలి. ఇలా 40 రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య, వాటి నాణ్య‌త పెరిగి సంతానాన్ని పొంద‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మందార పువ్వుల పొడి వల్ల ఇతర ప్రయోజనాలు..

ఈ మందార పువ్వుల పొడిని నీటిలో వేసుకుని క‌షాయంలా చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుందట. ఈ మందార పువ్వుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌తో బాధ‌ప‌డుతున్న వారు మందార పువ్వులతో చేసిన క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.