Awareness : పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన ఎలా కల్పించాలి అంటే.. !

Children awareness : పిల్లలకు లైంగిక విషయాల కోసం ఎలా తెలపాలి అనే భయం లేకుండా పూర్తిస్థాయిలో దీనిపై అవగాహన కల్పించాలి.. ఎదుగుతున్న పిల్లల్లో ప్రతి విషయం పైన ఒక రకమైన ఆసక్తి నెలకొంటుంది అయితే వారు

Awareness : పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన ఎలా కల్పించాలి అంటే.. !
aware of good touch and bad touch


Children awareness : పిల్లలకు కొన్ని విషయాలు చెప్పడానికి ఎలాంటి మొహమాటం ఉండకూడదు. ముఖ్యంగా వాళ్లు చిన్నపిల్లలు కదా ఇలాంటి విషయాలు ఎలా చెప్పాలి అని సందేహం లేకుండా వారికి పూర్తిస్థాయిలో అన్ని వివరించగలగాలి. అప్పుడే వారు మానసికంగా పరిపక్వత చెందుతారు.. సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులను వారు ఎదుర్కోవటానికి మానసిక ధైర్యాన్ని తల్లిదండ్రులే ఇవ్వాలి అనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు కొన్ని విషయాలు పాటించాలి.. 

పిల్లలకు లైంగిక విషయాల కోసం ఎలా తెలపాలి అనే భయం లేకుండా పూర్తిస్థాయిలో దీనిపై అవగాహన కల్పించాలి.. ఎదుగుతున్న పిల్లల్లో ప్రతి విషయం పైన ఒక రకమైన ఆసక్తి నెలకొంటుంది అయితే వారు అడిగే అన్ని ప్రశ్నలకు మీరు కోప్పడకుండా సరైన రీతిలో వివరించడం చాలా అవసరం.. అవసరమైతే వారికి పుస్తకాల ద్వారా నేర్పించడం లేదా స్కూల్లో టీచర్లు చేత చెప్పించడం కూడా చేయవచ్చు.. 

అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నప్పుడు లేదా వీధి దాటడానికి చేతులు పట్టుకున్నప్పుడు,  కారులో సీటు బెల్ట్‌ను పెట్టుకునేటప్పుడు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి కొన్ని విషయాలు బోధించడం నేర్పించండి. చేయడం వల్ల వారు శరీరానికి ఉండే విలువను తెలుసుకుంటారు. ఎవరైనా వారిని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టినప్పుడు గట్టిగా మర్యాదపూర్వకంగా వారికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పటం తప్పనిసరి అని పిల్లలకి తెలియచేయాలి అలాగే మన శరీరం పైన పూర్తి హక్కులు మనకే ఉంటాయని.. దానిని ముట్టుకునే హక్కు ఎవరికీ ఉండదని తెలపాలి.. 

అలాగే పిల్లలకు నేర్పవలసిన మరో ముఖ్యమైన అంశం నో చెప్పటం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారికి నచ్చకుండా ఇష్టం లేకుండా ఏ విషయానికి ఒప్పుకోవలసిన అవసరం లేదని నిర్మొహమాటంగా నో చెప్పటం నేర్చుకోవాలని తెలపాలి. 

అలాగే పిల్లలకు కచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం తెలియజేయాలి ఎవరైనా వారిని ముట్టుకోవటం లేదా ప్రైవేట్ పాట్లను టచ్ చేయడం వంటివి చేస్తే దానిని ఎలా ఎదిరించాలి అనే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా పిల్లలకు తెలియజేయడం వల్ల పెను ప్రమాదాల నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుంది.. తల్లిదండ్రులుగా పిల్లలు ఈ సమాజాన్ని ఎదుర్కోవలసిన తీరును వారికి నేర్పవలసింది మీరు మాత్రమే అని గుర్తుంచుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.