Aromatherapy : అరోమాధెరపీ ఆయిల్స్.. ఏ నూనెలు ఎందుకు వాడుతారంటే

Aromatherapy : మంచి వాసన పీల్చినప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది. పువ్వుల నుంచే వాసన అయితే ఇంకా బాగుంటుంది.మెదడుకు కూడా బాగా పనిచేస్తుంది. వాసనల వల్ల మెదడులోని నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో మానసిక ఉల్లాసం

Aromatherapy  :  అరోమాధెరపీ ఆయిల్స్.. ఏ నూనెలు ఎందుకు వాడుతారంటే
Aromatherapy


Aromatherapy  : మంచి వాసన పీల్చినప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది. పువ్వుల నుంచే వాసన అయితే ఇంకా బాగుంటుంది.మెదడుకు కూడా బాగా పనిచేస్తుంది. వాసనల వల్ల మెదడులోని నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. అందుకనే Aromatherapy  అనే పదం వాడుకలోకి వచ్చింది. Aromatherapy అంటే పలు రకాల సువాసనలను పీల్చి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడం. ఈ క్రమంలోనే పలు రకాల ఆయిల్స్‌ను అరోమాథెరపీ కోసం వాడుతుంటారు.
అరోమా థెరపీ వ్యాధులను తగ్గించదు. కానీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మానిసక ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వస్తాయి. అయితే మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఆయా వ్యాధులు రాకుండా ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే అరోమాథెరపీ పనిచేస్తుంది.

అరోమాథెరపీ వల్ల మనస్సుకు ఆనందాన్ని కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. అందువల్ల అరోమా థెరపీతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
అరోమా థెరపీలో భాగంగా గులాబీ, మల్లెపూలు, లిలియాక్‌, లావెండర్‌, సిట్రస్‌ పండ్లు, పుదీనా ఆకులు, చందనం, తులసి ఆకులు, వాము, దాల్చిన చెక్క, లవంగం, జాజికాయ.. వంటి పదార్థాలు, ఆకులతో తయారు చేసిన నూనెలను వాడుతారు. వాటిని వాసన పీలిస్తే పలు సమస్యలు తగ్గుతాయి.
మల్లె పువ్వుల ఆయిల్‌ను వాసన పీల్చడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
లావెండర్‌ ఆయిల్‌ను వాసన పీలిస్తే ఒత్తిడి, జలుబు, మైగ్రేన్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే శరీరం తాజాగా అనిపిస్తుంది. 
దిండు మీద రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ను వేసి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ ఆయిల్‌ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి చెమట వాసన రాకుండా ఉంటుంది.
చందనం ఆయిల్‌ను వాసన పీలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా ఫ్రష్‌గా ఉంటారు.  
 
అరోమాథెరపీలో గులాబీ తైలాన్ని అద్భుతమైన తైలంగా చెబుతారు. సున్నిత మనస్సు ఉన్నవారికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, చర్మ సమస్యలు తగ్గుతాయి.
యూకలిప్టస్‌ ఆయిల్‌లో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. శరీరంలోని శ్లేష్మాన్ని ఈ ఆయిల్‌ తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్‌, జ్వరం, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఈ ఆయిల్‌ను వాసన పీలిస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
సంపెంగ నూనెను వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. జుట్టుకు పెరుగుదలకు సహాయ పడుతుంది. హైబీపీ, తలనొప్పి తగ్గుతాయి.
ఓవర్‌ యాక్టివ్‌గా ఉండే పిల్లలకు మరువం తైలాన్ని నీటిలో కలిపి స్నానం చేయించాలి. దీంతో వారు స్థిమితంగా ఉంటారు. ఈ నూనె ఒత్తిడిని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. మరువం నూనెతో మర్దనా చేస్తే తలనొప్పి, టెన్షన్లు తగ్గుతాయి. నీటిలో వేసి ఆవిరిపడితే ఆస్తమా, సైనస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి.
నిమ్మ ఆయిల్‌ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
రోజ్‌మేరీ ఆయిల్‌ను వాసన పీల్చడం వల్ల మనస్సు ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. డిప్రెషన్‌, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.