ఈ ఆసనంతో ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి తెలుసా..? 

రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలని వైద్యులు చెప్తారు.. మనం సన్నాగానే ఉన్నాం కదా మనకెందుకులే వ్యాయామం అని చాలామంది అనుకుంటారు.. వ్యాయామం అంటే కేవలం లావుతగ్గడానికే అనుకోవడం మూర్ఖత్వం

ఈ ఆసనంతో ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి తెలుసా..? 


రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలని వైద్యులు చెప్తారు.. మనం సన్నాగానే ఉన్నాం కదా మనకెందుకులే వ్యాయామం అని చాలామంది అనుకుంటారు.. వ్యాయామం అంటే కేవలం లావుతగ్గడానికే అనుకోవడం మూర్ఖత్వం. వ్యాయామం అంటే.. ఆరోగ్యంగా ఉండటం, శరీరంలో ఒక్కో అవయవాన్ని క్లీన్‌ చేయడానికి ఒక్కో వ్యాయామం ఉంది. యోగాసనాలతో శరీరాన్ని క్లీన్ చేసుకోవచ్చు.. బాహ్యంగా బాడీకి రెండు సార్లు సోప్‌ పెట్టి స్నానం చేస్తే ఒళ్లు చెమట వాసన రాకుండా ఉంటుంది కానీ..లోపల చెత్త అలానే ఉంటుంది.. అవయవాలకు స్నానం చేయించడమే యోగ.. నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో చూద్దామా..!

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు చక్కగా క్లీన్‌ అవుతాయి..!

నేలపై వెల్లకిలా పడుకోవాలి.

రెండు అర చేతులను తెచ్చి పొట్టపై పెట్టాలి.

కళ్లు మూసుకుని రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను పీలుస్తూ 5 వరకు లెక్కబెట్టాలి.

రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ 5 వరకు లెక్కించాలి.

ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే పరగడుపునే కనీసం 10 సార్లు చేయాలి.

దీన్ని అవసరం అనుకుంటే ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం చేయడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. 

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

ఇలా కూడా చేయండి..

అతి మధురం చూర్ణాన్ని అర టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

ఉదయం పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం తాగినా.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.