సమ్మర్‌లో మీ బాడీ కూల్‌గా అవ్వాలంటే.. కచ్చితంగా గుల్కండ్‌ తినాల్సిందే!

సమ్మర్‌ వచ్చేసింది.. ఇప్పుడు తినే ఆహారాల్లో మార్పు చేసుకోకపోతే..కడుపు మంట, ఒళ్లంతా వేడి, దుద్దర్లు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ టైమ్‌లో మసాలాలు ఉన్న వంటలు తినాలనిపించదు.. బాగా కూల్‌గా ఉండేవి, ఒంటికి చలువ చేసేవి అయితే బెటర్‌..

సమ్మర్‌లో మీ బాడీ కూల్‌గా అవ్వాలంటే.. కచ్చితంగా గుల్కండ్‌ తినాల్సిందే!


సమ్మర్‌ వచ్చేసింది.. ఇప్పుడు తినే ఆహారాల్లో మార్పు చేసుకోకపోతే..కడుపు మంట, ఒళ్లంతా వేడి, దుద్దర్లు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ టైమ్‌లో మసాలాలు ఉన్న వంటలు తినాలనిపించదు.. బాగా కూల్‌గా ఉండేవి, ఒంటికి చలువ చేసేవి అయితే బెటర్‌.. వేసవిలో తినగలిగిన ఆహారాల్లో గుల్కండ్‌ ఒకటి.. ఈ పేరు మీరు వినే ఉంటారు.. దీన్ని గులాబీ పువ్వుల రేకుల‌తో త‌యారు చేస్తారు. వేస‌విలో దీన్ని నిత్యం తీసుకోవ‌డం వల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. గుల్కండ్‌ స‌హ‌జ‌సిద్ధ‌మైన కూలంట్‌. ఇది శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది.. అందుకే దీన్ని వేస‌విలో రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలని చెప్తుంటారు. 

మార్కెట్‌లో గుల్కండ్‌ విరివిగా దొరుకుతుంది. అయితే దీన్ని ఇంట్లోనూ మీరు స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకోసం..గులాబీ పువ్వుల రేకుల‌ను సేక‌రించాలి. వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంపై పేర్చి ఎండ‌లో ఎండ‌బెట్టాలి. స‌గం ఎండాక వాటిని తీసి ఒక సీసాలో వేయండి. ఒక పొర గులాబీ పువ్వుల రేకులు, ఒక పొర చ‌క్కెర ఇలా సీసాలో వేస్తూ సీసాను నింపండి.. అనంత‌రం సీసాకు మూత పెట్టి దాన్ని మ‌ళ్లీ ఎండ‌లో ఉంచాలి. అలా 21 రోజుల పాటు ఉంచితే గుల్కండ్ త‌యార‌వుతుంది. దాన్ని నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి.

వేస‌విలో స‌హ‌జంగానే కొంద‌రికి చ‌ర్మం ప‌గులుతుంది. ఇంకొంద‌రికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఎక్కువ అవుతుంది. కొంద‌రికి విరేచ‌నాలు అవుతాయి. కొంద‌రికి జుట్టు కుదుళ్లు దుర‌ద‌లు పెడ‌తాయి. ఇలా సమ్మర్‌లో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాట‌న్నింటికీ గుల్కండ్ చక్కటి ప‌రిష్కారం చూపుతుంది.

గుల్కండ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు.. 

గుల్కండ్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అసిడిటీ, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, పీసీవోఎస్‌, మొటిమ‌లు, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌తో 1 టీస్పూన్ గుల్కండ్‌ను తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా అవుతుంది.

ప‌గ‌టిపూట గుల్కండ్‌ను తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ త‌గ్గుతాయి.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 టీస్పూన్ మోతాదులో తీసుకుంటే జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తీపి తినాల‌నే కోరిక పోతుంది.

త‌మ‌ల‌పాకుతో క‌లిపి దీన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ స‌రిగ్గా ఉంటుంది. 

శ‌రీరం మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను స‌రిగ్గా శోషించుకుంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.