Aloe vera : కలబందలో ఇన్ని అద్భుత ఔషధ గుణాలున్నయన్న సంగతి తెలుసా.. 

Aloe vera లో ఎన్నో విశేషాలు ఉన్నాయని.. అలాగే ఆరోగ్యానికి, అందానికి Aloe vera ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన Aloe vera చర్మం పై వచ్చే ఎన్నో రకాల సమస్యలను నివారిస్తుంది.

Aloe vera : కలబందలో ఇన్ని అద్భుత ఔషధ గుణాలున్నయన్న సంగతి తెలుసా.. 
Medicinal properties of aloe vera


నేటి రోజుల్లో మనకు దొరికిన అద్భుత ఔషధం Aloe vera..  దేశ విదేశాల్లో ఉన్నవారు భారతదేశానికి వచ్చి Aloe vera విశేషాలు తెలుసుకొని వాళ్ళ దేశంలో ఇప్పుడు లక్షల హెక్టార్ లో పండిస్తున్నారు. ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న Aloe vera ను ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులకు మందులను కనుక్కుంటున్నారు.

అలాంటి కలబందను మనం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. కలబందలో ఎన్నో విశేషాలు ఉన్నాయని.. అలాగే ఆరోగ్యానికి, అందానికి కలబంద ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.

సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన కలబంద చర్మం పై వచ్చే ఎన్నో రకాల సమస్యలను నివారిస్తుంది.. రోజు పరగడుపునే కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.. పొట్ట మొత్తం క్లీన్ అవ్వటేమే కాకుండా.. శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది..  స్త్రీ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కలబంద జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే అందం విషయములో కూడా ఎంతో మేలు చేస్తుంది కలబంద..  రోజు కలబందను మొహానికి రాసుకోవడం వల్ల మొహం ఎంతో కాంతవంతంగా మారుతుంది..  నల్లని మచ్చలను తగ్గించడంలో కలబంద ముందుంటుంది..  అలాగే వయసు పెరుగుతున్న కొలది వచ్చే ముడతలు నివారించడంలో కలబంద ఎంతో ఉపయోగపడుతుంది.  దీన్ని నేరుగానే రాసుకోవచ్చు..  అలాగే డాండ్రఫ్ సమస్యలతో బాధపడేవారు..  జుట్టు పొడిబారి ఇబ్బంది పెడుతుంటే తలకు కలబందని రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కలబంద సహజ కండిషనర్ గా పనిచేస్తుంది. ఎలాంటి రసాయనాలు లేని ఈ కలబందను మన నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో అద్భుత ఫలితాలను పొందవచ్చు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.