కాఫీ ఎక్కువగా తాగితే మూత్రం దుర్వాసన వస్తుందా..?

మనిషి శరీరం అందంగా ఉండాలంటే బాహ్యాంగా బాగుంటే సరిపోదు.. లోపల నుంచి క్లీన్‌గా ఉండాలి. లేకపోతే దుర్వాసన వస్తుంది. కొంతమంది వ్యక్తులు అప్పుడే స్నానం చేసిన సరే అరగంటకే మళ్లీ చెమట వాసన, నోట్లోంచి దుర్వాసన వస్తుంది.టాయిలెట్‌కు వెళ్లినా కూడా

కాఫీ ఎక్కువగా తాగితే మూత్రం దుర్వాసన వస్తుందా..?


మనిషి శరీరం అందంగా ఉండాలంటే బాహ్యాంగా బాగుంటే సరిపోదు.. లోపల నుంచి క్లీన్‌గా ఉండాలి. లేకపోతే దుర్వాసన వస్తుంది. కొంతమంది వ్యక్తులు అప్పుడే స్నానం చేసిన సరే అరగంటకే మళ్లీ చెమట వాసన, నోట్లోంచి దుర్వాసన వస్తుంది.టాయిలెట్‌కు వెళ్లినా కూడా ఒకటే కంపు. ఇలా మీ శరీరం నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందంటే మార్చాల్సింది సబ్బు కాదు మీరు ఆహారపు అలావాట్లు. లోపల అంతా చెత్త పేరుకుపోయిన ఈ విధంగా కంపు కొడుతుంది. మ‌న శ‌రీరంలో ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా కూడా మూత్రం యొక్క వాస‌న‌, రంగు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రం యొక్క వాస‌న‌, రంగును బ‌ట్టి మ‌న శ‌రీరంలో ఉండే అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. 
Is coffee healthy? | CNN
శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కు గురి అయిన‌ప్పుడు మూత్రం వాస‌న వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో ఉండే నీటితో పాటు వ్య‌ర్థాలు కూడా మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌నం నీటిని ఎక్కువ‌గా తాగితే నీటి శాతం ఎక్కువ‌గా అమ్మోనియా శాతం త‌క్కువ‌గా ఉంటుంది. అదే నీరు త‌క్కువ‌గా తాగిన‌ప్పుడు నీటి శాతం త‌క్కువ‌గా అమ్మోనియా శాతం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో మూత్రం ఎక్కువ వాస‌న వ‌స్తుంది. మూత్రం క‌షాయం లేదా తేనె రంగులో ఉంటే శ‌రీరం తీవ్ర డీహైడ్రేష‌న్ బారిన ప‌డిన‌ట్టు గుర్తించి నీటిని ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాపీ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల కూడా మూత్రం రంగు, వాస‌న ఘాటుగా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం కూడా మూత్ర విస‌ర్జ‌నకు దారి తీస్తుంది. ఇది మూత్రం రంగు, వాస‌న‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. కాఫీ తాగే ముందు నీటిని ఎక్కువ‌గా తాగ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. 
యుటిఐ ( యూరీన‌రి ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ ల) కార‌ణంగా కూడా మూత్రం ఘాటైన వాస‌న‌ను, రంగును క‌లిగి ఉంటుంది. అంతేకాకుండా మూత్ర విసర్జ‌న స‌మ‌యంలో మంట‌, చికాకు కూడా ఉంటుంద‌ని ఈ ప‌రిస్థితి త‌లెత్తిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు. స్త్రీల‌ల్లో తలెత్తే ఈస్ట్ ఇన్ఫెక్ష‌న్‌ల కార‌ణంగా కూడా మూత్రం వాస‌న‌, రంగు గాడ‌త‌ను క‌లిగి ఉంటుద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్ యోనితో పాటు శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో కూడా నివ‌సిస్తుంది. ఇది ఇత‌రుల‌కు కూడా సంక్ర‌మించే అవ‌కాశం ఉంది. ఈ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా దుర‌ద‌, మంట‌, తెల్ల బ‌ట్ట వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. 
మూత్ర‌పిండాల్లో రాళ్లు, కాలేయ స‌మ‌స్య‌లు ఉన్నా కూడా మూత్రం ఘాటైన వాస‌న‌, రంగును క‌లిగి ఉంటుంది. అదే విధంగా డ‌యాబెటిస్ ఉన్న వారిలో కూడా మూత్రం రంగు, వాస‌న‌లో మార్పులు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. డ‌యాబెటిస్ ఉన్న వారిలో మూత్రం తియ్య‌టి పండ్ల వాస‌న‌ను క‌లిగి ఉంటుంద‌ని అలాగే త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.