Olive Oil: నిత్యజీవితంలో ఆలివ్ ఆయిల్ ను భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Olive Oil లో ఉండే సుగుణాలు శరీరానికి పలు రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ రోగ నిరోధక శక్తిని తగ్గించే బ్యాక్టీరియా వైరస్ లతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.

Olive Oil: నిత్యజీవితంలో ఆలివ్ ఆయిల్ ను భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Olives oil


ఆలివ్ చెట్టుకి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పుకోదగినది. కేవలం శరీరానికి మేలు చేసే చెట్టుగానే కాకుండా అధికారానికి కీర్తికి చిహ్నంగా కూడా భావిస్తారు. అపరిమిత శక్తికి, కీర్తికి చిహ్నం ఆలివ్ చెట్టు. అందుకే యుద్ధాల్లో సైతం శాంతికి చిహ్నంగా ఆలివ్ ఆకులను చూపిస్తారు.

Olive oil  లో ఉండే సుగుణాలు శరీరానికి పలు రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ రోగ నిరోధక శక్తిని తగ్గించే బ్యాక్టీరియా వైరస్ లతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే సుగుణాలు క్యాన్సర్ సైతం తగ్గిస్తాయి. అందుకే నిత్యం ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలుస్తోంది.

ఆలివ్ ఆయిల్ కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యల సైతం రాకుండా ఉంటాయి.

ఎముకలకు సంబంధించిన వ్యాధులు, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. అందుకే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల గుండెకు జీర్ణశక్తికి మేలు జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆలివ్ ఆయిల్ కొంచెం ఘాటుగా, తియ్యగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తొందరగా జీర్ణం అవుతుంది. కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

కడుపులో వచ్చే పుండ్లను, బ్యాక్టీరియాను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అన్నవాహిక క్యాన్సర్ను నివారించడంలో సైతం ఆలివ్ ఆయిల్ ప్రధానంగా పనిచేస్తుంది. అలాగే దీనిని నేరుగా తీసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఆలివ్ ఆయిల్ ను కొనుగోలు చేసినప్పుడు ఎక్స్ట్రా విరిజిన్ ఆలివ్ ఆయిల్ ను కొనటం మంచిది. అలాగే వీటిని నిలువ చేసినప్పుడు కూడా స్టవ్ పక్కన ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంచకుండా జాగ్రత్తగా నిల్వ ఉంచితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.