Hypothyroidism : హైపో థైరాయిడ్‌ సమస్య ఉందా..? అయితే చేపలు తినడం..

ఉన్నది ఒక్క శరీరమే..కానీ రోగాలు మాత్రం ఎన్నో.. బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కు జబ్బులు ఉంటాయి.నేడు థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది Hypothyroidism .

Hypothyroidism  :  హైపో థైరాయిడ్‌ సమస్య ఉందా..? అయితే చేపలు తినడం..
Hypothyroidism


ఉన్నది ఒక్క శరీరమే..కానీ రోగాలు మాత్రం ఎన్నో.. బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కు జబ్బులు ఉంటాయి.. అన్నింటిని ఆరోగ్యంగా చూసుకోవడం మన కర్తవ్యం. కానీ వయసుమీద పడే సరికి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నేడు థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది Hypothyroidism . ఏది వ‌చ్చినా ఇబ్బందులు ప‌డాల్సిందే.. కొన్ని ఆహారాలను తీసుకుంటే.. హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటంటే..

చేప‌లు
చేప‌ల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు చేస్తాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. థైరాయిడ్‌, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌లను స‌రిగ్గా ప‌నిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
ప్రొ బ‌యోటిక్ ఆహారాలు
పాలు, పాల సంబంధ ఉత్ప‌త్తులను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.
ఫైబ‌ర్
నిత్యం ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. శ‌రీరానికి 30 నుంచి 40 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందేలా చూసుకుంటే హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
కొబ్బ‌రినూనె
థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారిలో స‌హ‌జంగానే మెట‌బాలిజం క్ర‌మ‌బ‌ద్ధంగా ఉండ‌దు. దీంతో ఒకేసారి బ‌రువు పెర‌గ‌డ‌మో లేదా బ‌రువు త‌గ్గ‌డ‌మో జ‌రుగుతుంది. అయితే కొబ్బ‌రినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం- చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తాయి. దీంతో అల‌స‌ట త‌గ్గుతుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. వాపులు త‌గ్గుతాయి. ఫ‌లితంగా హైపో థైరాయిడ్ స‌‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.
మొల‌కెత్తిన విత్త‌నాలు
మొల‌కెత్తిన అవిసె గింజ‌లు, చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. ఇవి హార్మోన్ల‌ను స‌మ‌తుల్యం చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే వాపులు త‌గ్గుతాయి. థైరాయిడ్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది.
సూప్
చికెన్, మ‌ట‌న్ సూప్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రొలైన్‌, గ్లైసీన్ అనే అమైనో ఆమ్లాలు అందుతాయి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. అలాగే హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. అయితే తగిన మోతాదులో తక్కువ మసాలతోనే తీసుకోవాలి.
ఈ సమస్య ఉన్నవారు.. పైన చెప్పిన ఆహారాలను మీ డైట్‌లో యాడ్‌ చేసేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.