ఫ్యాటీ లివర్‌ సమస్యను నయం చేసే ఆయుర్వేదం టీ..! 

ఫ్యాటీ లివర్‌ సమస్య వల్ల..కాలేయంలో కొవ్వు పేరుకుపోయి.. అది దాని పనులను సరిగ్గా చేసుకోలేదు. మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం.. ఇది రోజు వందకు పైగా విధులను నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే దీనికి కొవ్వు పడుతుందే

ఫ్యాటీ లివర్‌ సమస్యను నయం చేసే ఆయుర్వేదం టీ..! 


ఫ్యాటీ లివర్‌ సమస్య వల్ల..కాలేయంలో కొవ్వు పేరుకుపోయి.. అది దాని పనులను సరిగ్గా చేసుకోలేదు. మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం.. ఇది రోజు వందకు పైగా విధులను నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే దీనికి కొవ్వు పడుతుందే.. ఇక ఏ పని చేయలేదు.. అలా నిద్రపోతుంది. దాని వల్ల ఆ పనులన్నీ పెండింగ్‌లో ఉంటాయి.. ఫలితంగా మనకు ఒక దాని తర్వాత ఒక సమస్య తలెత్తుతుంది. అందుకే.. ఆ కొవ్వు పట్టిన లివర్‌ను మళ్లీ మాములు స్థితికి తేవాలంటే.. ఫ్యాట్ అంతా వదిలించాలి.  

యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అధ్యయనం ప్రకారం.. ఈ రుగ్మతను పరిష్కరించడంలో కీలకమైనవి అప్పుడప్పుడు ఉపవాసం చేయడం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కెర, జంక్, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరం పెట్టాలి. ఇదే కాదు ఆయుర్వేద నివారణ మరొకటి ఉంది. ఇది సహజంగా ఫ్యాటీ లివర్ పరిస్థితిని నయం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆయుర్వేద టీకి కావాల్సిన పదార్థాలు..

అల్లం పొడి(శొంఠి)- ½ టీ స్పూన్
మెంతి గింజలు- ½ టీ స్పూన్
పసుపు-1/2 టీ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
పిప్పరమెంటు ఆకులు- 2 లేదా 3

తయారీ విధానం

ఒక పాత్రలో గ్లాసు నీటిని వేసి మరిగించి, మెంతి గింజలు, అల్లంపొడి, పసుపు, పుదీనా ఆకులు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆ పానీయాన్ని వడకట్టుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఈ టీ తాగితే చాలా మంచిది. అందులో చివరగా నిమ్మరసం జోడించుకుంటే సరిపోతుంది.

టీ ప్రయోజనాలు

ఈ టీ కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధిని తగ్గిస్తుంది. 
అల్లంలోని జింజేరోల్ అనే సమ్మేళనం వల్ల ఇది జరుగుతుంది. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. 
సెల్యులార్ దెబ్బతినకుండా కాపాడుతుంది. కాలేయాన్ని రక్షిస్తుంది.
ఇందులో వేసే మెంతి గింజలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనొలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. 
పసుపులో ఉన్న ఎంజైమ్‌లు కొవ్వుని కరిగించడంలో తోడ్పడతాయి. మంటను కూడా నయం చేస్తుంది. 
కాలేయానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కాలేయం కోసం వెల్లుల్లి, ఓట్స్ తో వండిన ఆహారం, చేపలు, గ్రీన్ టీ, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్, బెర్రీ పండ్లు, గుడ్లు, నట్స్ వంటివి తినాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.