Benefits of Vajrasana : తిన్నాక ఈ ఆసనం వేస్తే.. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది తెలుసా..?

Benefits of Vajrasana : యోగా అయినా, వ్యాయామం అయినా.. తినక ముందు పరగడుపున చేయాలి. కానీ ఇది మాత్రం తిన్నాక కూడా చేయొచ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం..

Benefits of Vajrasana : తిన్నాక ఈ ఆసనం వేస్తే.. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది తెలుసా..?


ఉదయాన్నే యోగా చేయడం వల్ల ఆరోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు.. జిమ్‌కు వెళ్లి బరువు లెత్తడం బలం ఉన్న ఎవరైనా చేస్తారు.. కానీ యోగా అనేది ఏకాగ్రత ప్రాక్టీస్‌ మీద ఆధారపడి ఉంటుంది.. బాడీని లోపలి నుంచి క్లీన్‌ చేసే పవర్‌ యోగాకు ఉంది. అయితే యోగా అయినా, వ్యాయామం అయినా.. తినక ముందు పరగడుపున చేయాలి. కానీ ఇది మాత్రం తిన్నాక కూడా చేయొచ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం చేశాక కూడా వేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక ఈ ఆస‌నం వేస్తేనే లాభాలు క‌లుగుతాయి. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..?

వ‌జ్రాస‌నం వేసే విధానం

సౌక‌ర్య‌వంతంగా, నిటారుగా కూర్చోవాలి.

రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.

ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను వెన‌క్కి మ‌డ‌వాలి.

వెనుక వైపు అరికాళ్లు పైకి కనపడేలా ఉంచుకోవాలి.

మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.

వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనల‌ను సరిసమానంగా ఉంచాలి.

రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.

రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.

తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.

వజ్రాసనంలో ఉన్నంతసేపు నిటారుగా ఉండాలి.

ఈ ఆస‌నాన్ని 30 సెక‌న్ల‌తో మొద‌లుపెట్టి 15 నిమిషాల వ‌ర‌కు వేయ‌చ్చు. ఓపిక ఉన్నంత సేపు ఈ ఆస‌నంలో ఉండ‌వ‌చ్చు. కాల ప‌రిమితి అంటూ ఏమీ లేదు. ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ చేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక మ‌ధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటలా ఈ ఆస‌నం వేయ‌వ‌చ్చు.  

వ‌జ్రాసనం వ‌ల్ల క‌లిగే లాభాలు..

వ‌జ్రాస‌నం వేయడం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది.

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు.

జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే అల్స‌ర్లు మాయ‌మ‌వుతాయి.

అసిడిటీ, గ్యాస్ ఉండ‌వు.

వెన్నెముక దృఢంగా మారుతుంది.

వెన్నె నొప్పి, స‌యాటికా ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

పెల్విక్ కండ‌రాలు దృఢంగా మారుతాయి.

మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో నొప్పులు త‌గ్గుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.