వేరుశనగతో కలిగే లాభాలు..

వేరు శనగ ఎన్నో పోషకాలకు నిలయం తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి..  యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది..

వేరుశనగతో కలిగే లాభాలు..
Benefits of peanuts


వేరుశనగతో ఎన్నో పోషకాలకు నిలయం తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.. 

వేరుశనగ లో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి..  యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది.. తరచూ పెట్టిన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందుతాయి.. వేరు శెనగ చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్నశాకాహారము. ఒక కిలో మాంసములో లబించే మాంసకృత్తులు అదే మోతాదు వేరుశెనగలో లభిస్తాయి. ఒక కోడి గుడ్డుకి సమానము వేరుశెనగ పప్పును తీసుకొని అంచనవేస్తే .. గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి.. 

వేరుశనగని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుండి బయటపడవచ్చు అంటున్నారు అంతేకాకుండా మహిళలకు ఎక్కువగా వచ్చే ఈ మధుమేహ సమస్యను అదుపులో ఉంచవచ్చు అని తెలుస్తుంది..శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో వేరుశెనగ సహాయపడటమే కాకుండా... ఇది గుండె జబ్బులను దరిచేరనీయదు.

గుండె పనితీరు సక్రమంగా ఉండటానికి..ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతే కాకుండా యాంటీ ఏజింగ్‌గా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

రాత్రి పడుకునే ముందు వేరుశెనగలను నీటిలో నానబెట్టి, ఆ తర్వత రోజు తినాలి..  తినడానికి ముందు వేరుశెనగలో ఉన్న నీటిని వడపొయ్యాలి.. రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది.. వీరికి వేరుశెనగ నూనె కుడా పడదు. అయితే పల్లీలు అందరికీ పడతాయని కూడా చెప్పలేం. వేయించిన పల్లీలు కొందరిలో అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివాళ్లు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.