Prostate cancer : ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు చికిత్సలు ఎలా ఉంటాయి..? కారణాలు ఏంటి..?

Prostate cancer : cancer ఏదైనా ప్రమాదకరమే..దేశంలో నమోదవుతున్న టాప్ 10 క్యాన్సర్ కేసుల్లో  prostate cancer కూడా ఒకటి.. వృద్ధాప్య జనాభా పెరుగుదలతో పాటు జీవనశైలి మార్పులు, ఊబకాయం కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది..ప్రోస్టేట్ అనేది మూత్రాశయం దగ్గర కనిపించే పునరుత్పత్తి అవయవం.

Prostate cancer : ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు చికిత్సలు ఎలా ఉంటాయి..? కారణాలు ఏంటి..?
Treatments and reasons for prostate cancer


Prostate cancer : cancer ఏదైనా ప్రమాదకరమే..దేశంలో నమోదవుతున్న టాప్ 10 క్యాన్సర్ కేసుల్లో  prostate cancer కూడా ఒకటి.. వృద్ధాప్య జనాభా పెరుగుదలతో పాటు జీవనశైలి మార్పులు, ఊబకాయం కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది..ప్రోస్టేట్ అనేది మూత్రాశయం దగ్గర కనిపించే పునరుత్పత్తి అవయవం. ఇది స్పెర్మ్‌ను పోషించడం, రక్షించడం లాంటి పనులు చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాల అనియంత్రిత పెరుగుదల క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇది వృద్ధాప్యం లేదా జన్యుపర సమస్యల వల్ల వస్తుంది. 

సాధారణంగా పురుషుల వయసు పెరిగే కొద్ది.. ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రతి 8 మందిలో ఒకరికి ఈ ముప్పు ఉంటోంది.. చాలా సందర్భాల్లో 70 ఏళ్ల వయస్సు వచ్చే సరికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ వ్యాధి నిర్ధారణ కష్టతరమవుతుంది. అందువల్ల పురుషీ నాళం ద్వారా పరీక్ష చేయాల్సి వస్తుంది. ఇది ఒకింత కష్టతరమైనదిగా చెప్పొచ్చు. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు, కారణాలు..

అంటే అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, తరచుగా వెళ్లాల్సి రావడం, మూత్ర విసర్జన సాఫీగా సాగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలగే ప్రొస్టేట్ క్యాన్సర్ ఎముకలకు వ్యాప్తి చెందితే వెన్నునొప్పి కూడా వస్తుంది.

అమితంగా మాంసాహారం తినడం, ఊబకాయం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. దీనికి తోడు జన్యుపరమైన కారణాలు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణం అవుతాయి.


చికిత్స ఎలా ఉంటుంది..

  • ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సర్జరీ, రోబోటిక్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు ఉంటాయి.
  • ఫిట్‌గా లేని వారు, ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిలో నిరంతర నిఘా, పరిశీలన ఉంచాలి.

సర్జరీ : రొబోటిక్ అసిస్టెడ్ ఆర్ఏఆర్‌పీ సర్జరీలో ప్రొస్టేట్‌ను తొలగిస్తారు. అలాగే చుట్టూ ఉండే కణతులను తొలగిస్తారు.
రేడియేషన్ థెరపీని ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపేస్తారు.

క్రయోథెరిపీ : స్థానికంగా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు.

  • హార్మోన్ థెరపీ ద్వారా నయం చేస్తారు.
  • క్యాన్సర్ ముదిరినప్పుడు కీమోథెరపీ చేస్తారు.
  • ప్రొస్టేట్ క్యాన్సర్‌కు వాక్సిన్స్‌తో కూడిన ఇమ్యునోథెరపీని కూడా ఇస్తారు.
  • సాధారణ కణాలకు భంగం వాటిల్లకుండా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని టార్గెటెడ్ థెరపీ చేస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.