సన్నగా ఉన్నారని సంబరపడకండి.. భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశం మీకే ఎక్కువ..!

ఈ రోజుల్లో వచ్చే ప్రతి రోగానికి మూల కారణం.. లావుగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు. .సన్నగా ఉంటే.. ఎలాంటి రోగాలు రావని భావిస్తుంటారు. కానీ సన్నగా ఉన్నవాళ్లకు కూడా కొన్ని రోగాలు వస్తాయి.. ఇంకా చెప్పాలంటే.. ఇవి వారికి మాత్రమే స్పెషల్‌గా వస్తాయి..

సన్నగా ఉన్నారని సంబరపడకండి.. భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశం మీకే ఎక్కువ..!


ఈ రోజుల్లో వచ్చే ప్రతి రోగానికి మూల కారణం.. లావుగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు. .సన్నగా ఉంటే.. ఎలాంటి రోగాలు రావని భావిస్తుంటారు. కానీ సన్నగా ఉన్నవాళ్లకు కూడా కొన్ని రోగాలు వస్తాయి.. ఇంకా చెప్పాలంటే.. ఇవి వారికి మాత్రమే స్పెషల్‌గా వస్తాయి..కొన్ని రకాల వ్యాధులు సన్నగా ఉండడం, లావుగా ఉండడం అనే తేడా లేకుండా దాడి చేస్తాయి.. 
Are thin people just lucky to have 'skinny' genes? - Genetic Literacy  Project
చాలా మంది ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’. లావుగా బాగా కొవ్వు ఉన్నవాళ్లకే వస్తాయి అనుకుంటారు. ఎక్కువగా అయితే ఊబకాయంతో బాధపడేవారిలో ఇది కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల సన్నగా ఉన్న వారికి కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ వినియోగం.. మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్లు బక్కగా ఉన్నా కూడా వారికి ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడే అవకాశం ఉంది.
మద్యంలో ఉండే క్యాలరీలు జీరో. అందుకే మద్యం కాలేయంలో చేరుకున్నాక కొవ్వుగా మారిపోతుంది. అలా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం తాగడం మానేయాలి. ఊబకాయంతో ఉన్న వారు అయితే పూర్తిగా మద్యాన్ని దూరం పెట్టాలి. కండలు లేకపోవడం.. కొందరు సన్నగా ఉంటారు. కండలు ఉండవు. ఎంతోకొంత కండర ద్రవ్యరాశి ఉండడం చాలా ముఖ్యం. ఎండిపోయినట్టు, పీక్కుపోయినట్టు చేతులు, కాళ్లు ఉండకూడదు. కండరాలు పుష్టిగా లేకపోవడం వల్ల కాలేయం కొవ్వులో పేరుకుపోతుంది..
సన్నగా ఉన్నవారికి కండలు తక్కువగా ఉంటాయి. శరీరం పుష్టిగా ఉండడం చాలా ముఖ్యం. కొంతమంది వారసత్వంగా సన్నగా ఉంటారు.. ఎంత తిన్నా వాళ్లు బక్కజీవుల మాదిరిగానే ఉంటారు.. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి ఒక వయసుకు వచ్చాక బయటపడుతుంది. ఊబకాయం కూడా వారసత్వంగా వస్తుంది. ఈ రెండూ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, దానికి ఊబకాయం తోడైతే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. జీవక్రియ రుగ్మత..ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటివి రావడానికి కొన్ని రకాల జీవక్రియ సమస్యలు కూడా కారణమే. విల్సన్స్ వ్యాధి పిలిచే జీవక్రియ రుగ్మత వల్ల ఫ్యాటీ లివర్ డిసీస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
కాలేయ వ్యాధులు మాకు వచ్చే అవకాశం లేదని సన్నగా ఉండే వారు అనుకోవద్దు. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కాపాడుకోకపోతే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. అందుకే కాలేయానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని మరీ తినాలి. కాలేయం కోసం వెల్లుల్లి, ఓట్స్‌తో వండిన ఆహారం, చేపలు, కాఫీ, గ్రీన్ టీ, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్, బెర్రీ పండ్లు, గుడ్లు, నట్స్ వంటివి తినాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.