Ulcer : కడుపులో అల్సర్‌ మంటలా..? ఇలా చేయండి..!

Ulcer : కడుపులో అల్సర్‌ మంటలా..? ఇలా చేయండి..!


Ulcer  : మనలో ఉండే ప్రతి పార్ట్‌కు దాని విధులు ఎలా ఉంటాయో.. అలాగే కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఎలా అయితే ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుందో..అలాగే లోపల అవయవాలకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది.. అయినా సరే.. అవి నెట్టుకొస్తాయి.. ఎంత కష్టపడ్డా చివరకి మన అంతిమ లక్ష్యం.. ఆ బుజ్జి పొట్టను నింపుకోవడం కోసమే.. ఆ పొట్టలోనే ఎన్నో రహస్యాలు, ఎన్నో వ్యర్ధాలు, ఇంకెన్నో మలినాలు.. దీనివ్లల కడుపు మంట, అల్సర్లు.. సాధారణంగా పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుద‌ల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుంచి రెండున్న‌ర లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. కొంద‌రిలో ఇది మూడు లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢ‌త 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి, ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ యాసిడ్ లీట‌న్న‌ర నుంచి రెండు లీట‌ర్ల మోతాదులో త‌యార‌వుతుంది.

కొంద‌రిలో మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల కోపం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌, టీ కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం గోడ‌లు ఈ యాసిడ్ సాంధ్ర‌త‌ను త‌ట్టుకోలేక అల్స‌ర్లు, క‌డుపులో మంట, క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి వివిధ ర‌కాల టానిక్‌ల‌ను, మందుల‌ను వాడుతారు. 

స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్ప‌త్తిని త‌గ్గించి దాని స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో మ‌న‌కు శ‌తావ‌రి పొడి మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిపుణులు క‌నుగొన్నారు. క‌డుపులో మంట‌ను, అల్స‌ర్ల‌ను త‌గ్గించి జీర్ణక్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా శ‌తావ‌రి పొడి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

ఈ శ‌తావ‌రి పొడిని ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల పొట్ట‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిలు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌బ‌డ‌తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో ఒక టీ స్పూన్ శ‌తావ‌రి పొడిని వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌లో వ‌చ్చే అసౌక‌ర్యం నుంచి మ‌న‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. భోజ‌నానికి అర గంట ముందు ఈ కషాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.