ఈ ఆరు నియమాలు పాటిస్తే పెరాల్సిస్ స్ట్రోక్ రాదు!

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. అందులో పెరాల్సిస్ స్ట్రోక్ కూడా ఒకటి. కొంత మంది వీటి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

ఈ ఆరు నియమాలు పాటిస్తే పెరాల్సిస్ స్ట్రోక్ రాదు!
Guidelines for Paralysis stroke


ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. అందులో పెరాల్సిస్ స్ట్రోక్ కూడా ఒకటి. కొంత మంది వీటి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ పెట్టాలన్న తపన పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుంటున్నారు.  

అయితే జీవనశైలి లో మార్పులు ఇలా చేసుకొని ప్రతిరోజూ పాటిస్తే పెరాల్సిస్ స్ట్రోక్ రాదని వైద్యులు అంటున్నారు.

 1. రోజూ 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి.
 
 2. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు రోజూ 30 నుంచి 40నిమిషాలు చేయాలి.

3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వదిలెయ్యాలి. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ మొదలైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 

4. రోజువారి పనిగంటలను 13-14 నుండి 8-9 గంటలకు తగ్గించుకోవాలి. 

5. ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉండాలి. 

6. ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

చక్కని ఆరోగ్యానికి సరైన జీవనశైలి అత్యవసరం ఈరోజుల్లో చాలావరకు యువత ఉద్యోగాల పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది.. ఇలాంటి సమస్యల కారణంగానే ఎక్కమంది స్ట్రోక్స్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పటికీ సమయాన్ని సరైన రీతిలో విభజించుకొని ఆరోగ్యానికి తగిన సమయం కేటాయించాలి. నిత్యం వ్యాయామం చేయడం, మసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆందోళన తగ్గించుకోవడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం ఎంతో అత్యవసరం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.