fertility Problems : ఫెర్టిలిటీలో ఈ పదాలు మీకు తెలుసా..? అర్థాలు తెలిస్తే సంతానం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు..!

fertility Problems : సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై ఒక స్టేజ్‌ వచ్చాక అందరికీ కనీస అవగాహన ఉండాలి. అలాగే.. ఫెర్టిలిటీపై కూడా అంతోఇంతో నాలెడ్జ్‌ ఉండాలి.. ప్రత్యుత్పత్తి (రీప్రోడక్టివ్) ఆరోగ్యం గురించి తెలుసుకోవడం అవసరం

fertility Problems : ఫెర్టిలిటీలో ఈ పదాలు మీకు తెలుసా..? అర్థాలు తెలిస్తే సంతానం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు..!


Infertility Problems : సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై ఒక స్టేజ్‌ వచ్చాక అందరికీ కనీస అవగాహన ఉండాలి. అలాగే.. ఫెర్టిలిటీపై కూడా అంతోఇంతో నాలెడ్జ్‌ ఉండాలి.. ప్రత్యుత్పత్తి (రీప్రోడక్టివ్) ఆరోగ్యం గురించి తెలుసుకోవడం అవసరం. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు ఫర్టిలిటీ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇప్పుడు చాలా మందిలో ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన ఉండడం అవసరం. 30 ఏళ్ల వయస్సు నుంచి ఫర్టిలిటీ సామర్థ్యం క్షీణిస్తుందని చాలా మందికి తెలియదు.. పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే.. 30లోపు చేసేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు.. 30 దాటితే.. పిల్లలు పుట్టడం కష్టం. ఫెర్టిలిటీలో తరచూ వాడే కొన్ని పదాలు, వాటి అర్థాలను ఇప్పుడు చూద్దాం..!

 
 The fertile window : అనుకూలమైన సమయం
అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయాన్ని ఫర్టిలిటీ పీరియడ్ లేదా ఫర్టిలిటీ విండో అంటారు. రుతుచక్రం 21 రోజుల నుంచి 35 రోజుల మధ్య వస్తుంది. చాలా మందిలో 28 రోజులకే రుతుచక్రం వస్తుంది. రుతుచక్రానికి 14 రోజుల ముందు ఈ అండాల విడుదల అయ్యే ప్రాసెస్‌ స్టాట్‌ అవుతుంది. ఉదాహరణకు ఒక మహిళకు మెన్‌స్ట్రువల్ సైకిల్ 28 రోజులు అనుకుంటే.. 14 రోజుల ముందు అండం విడుదల ప్రక్రియ కొనసాగుతుంది. అంటే సంతానం కోరుకునే దంపతులు ఈ సమయలో సెక్స్‌లో పాల్గంటే మంచి ఫలితం ఉంటుంది. అండం విడుదలైనప్పుడు 24 గంటలపాటు అది సజీవంగా ఉంటుంది. వీర్యమైతే 36 నుంచి 72 గంటల పాటు సజీవంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Menses : రుతుక్రమం లేదా రుతు చక్రం, పిరియడ్స్‌..
కౌమార దశలో ఉండే అమ్మాయిలు, మహిళలందరికీ దీని గురించి తెలుసు.. రుతుచక్రంలో వచ్చే కడుపు నొప్పి లేదా వెన్నునొప్పి (పీరియడ్ పెయిన్) కొందరికి తీవ్రమైన వేదన కలిగిస్తుంది. అసాధారణ రక్తస్రావం, పీరియడ్ క్రాంపింగ్, వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తుంటాయి. మీ మెన్సెస్ సమయాన్ని ట్రాక్ చేసేందుకు మీరు డైరీ మెయింటేన్ చేయొచ్చు. తేదీలు, లక్షణాలు నోట్ చేసుకోండి. ఇది మీ ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని తెలుసుకోవడంలో సాయపడుతుంది.
The follicular phase : ఫాలిక్యులర్ దశ
అండాశయంలో అండం పరిపక్వం చెందే దశ ఇది. రుతుస్రావం ప్రారంభం రోజున మొదలై ఒవల్యూషన్ సమయానికి పూర్తవుతుంది. ఇదే సమయంలో పిండం కోసం అవసరమయ్యే ఎండోమెట్రియం లైనింగ్ నిర్మాణం కూడా మొదలవుతుంది.
Ovulation : అండం విడుదలయ్యే సమయం
పరిపక్వం చెందిన అండాన్ని అండాశయం నుంచి విడుదల చేయడాన్ని Ovulation అంటారు. రుతుస్రావానికి 14 రోజుల ముందు జరిగే ఈ ప్రక్రియ గర్భధారణకు అత్యంత అనువైన సమయంగా ఉంటుంది. ఇది కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది.
Luteal phase : లూటియల్ దశ
ఇది అండం విడుదలైన తరువాత జరిగే ప్రక్రియ. పిండం కోసం శరీరం సంసిద్ధమయ్యే ప్రక్రియ. పిండం ఏర్పడలేదంటే ఎండోమెట్రియం మందం తగ్గి తదుపరి మెన్సస్ సైకిల్ వచ్చేస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.