హైబీపీ కంట్రోల్‌ అవడం లేదా..? ఇలా చేశారంటే దెబ్బకు రీడింగ్‌ మారుతుంది..! 

మొక్క ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు బీపీని త‌గ్గిస్తాయి.

హైబీపీ కంట్రోల్‌ అవడం లేదా..? ఇలా చేశారంటే దెబ్బకు రీడింగ్‌ మారుతుంది..! 
Tips to control high blood pressure


High blood pressure కూడా కొన్నిసార్లు ప్రాణాంతకమే అవుతుంది. నిజానికి ఇది Diabetes కంటే డేంజర్‌.. High bloo pressure రావడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం, జీన్స్‌ వల్ల కూడా వస్తుంది. అధిక బరువు, అధికంగా ఉప్పు వాడడం, ఒత్తిడి ఇలా అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్ పాటించే ప్రతిఒక్కరికి ఏదో ఒక దీర్ఘకాలిక రోగం అయితే ఉంటుంది. 120/80 రీడింగ్ ఉండే దాన్ని నార్మ‌ల్ బీపీ అంటారు. ఇంత‌కు మించి ఎక్కువ‌గా రీడింగ్ న‌మోదు అయితే దాన్ని హైబీపీ అంటారు. ర‌క్త‌నాళాల గోడ‌లు గ‌ట్టి ప‌డడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో గుండె ఎక్కువ పీడ‌నంతో ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్ర‌మంలో హైబీపీ వ‌స్తుంది. అయితే అత్త‌ప‌త్తి మొక్క ఆకు వ‌ల్ల బీపీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని ఆయుర్వేదంలో ఉంది. మరీ ఆకును ఎలా వాడాలో చూద్దామా...
అత్త‌ప‌త్తి మొక్క ఆకుల‌ను సేక‌రించి శుభ్రం చేసి వాటి నుంచి ర‌సం తీయాలి. దాన్ని ఉద‌యం, సాయంత్రం 15 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది. అత్త‌ప‌త్తి మొక్క ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు బీపీని త‌గ్గిస్తాయి. చిన్నప్పుడు ఈ ఆకులతో చాలామంది ఆడుకునే ఉంటారు.ముట్టుకోగానే ముడుకుంటాయి..వీటిని ఇంగ్లీష్‌లో టచ్‌ మీ నాట్‌ ప్లాంట్‌ అంటారు. 

గాయాలకు కూడా...

అత్తిప‌త్తి మొక్క వేర్ల క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల దంతాలు గ‌ట్టిప‌డ‌తాయి. గాయాల‌పై, పుండ్లపై అత్తిప‌త్తి మొక్క వేర్ల‌ను మెత్త‌గా దంచి ఆ మిశ్ర‌మాన్ని రాయ‌డం వ‌ల్ల గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానిపోతాయి. ఈ విధంగా అత్తిప‌త్తి మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 400 ఎంఎల్ నీటిలో ఈ మొక్క వేర్ల‌ను వేసి 100 ఎంఎల్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఇలా మ‌రిగించిన నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్త విరేచ‌నాలు త‌గ్గుతాయి.

ఇవి కూడా..

బీపీ ఉన్న‌వారు మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నంలో పెరుగు లేదా మ‌జ్జిగ తింటే ఉప్పు వేసుకోరాదు. కూరల్లో కూడా వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి.. అలాగే సాధార‌ణ ఉప్పుకు బ‌దులుగా సైంధవ ల‌వ‌ణం వాడాలి. ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా మొల‌కెత్తిన గింజ‌లు, బొప్పాయి, అర‌టి పండ్ల‌ను తింటుండాలి. పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను రోజూ రెండు పూట‌లా తినాలి. దీంతో బీపీ త‌క్కువ స‌మ‌యంలోనే నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.