చూయింగ్‌ గమ్‌ పొరపాటున మింగేస్తే అది ప్రేగులకు హాని చేస్తుందా.. ?

చాలామందికి టైమ్‌పాస్‌కు చూయింగ్‌ గమ్‌ నమలడం అలవాటు. పైగా ఇది ఒక ఆటిట్యూడ్‌ కూడా. అలా స్టైల్‌గా చూయింగమ్‌ నములుతూ తెగ ఫోస్‌ కొడుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా దాన్ని మింగేస్తారు. చిన్నప్పుడు చెప్పేవాళ్లు... చూయింగమ్‌ మింగితే అది పేగులకు చుట్టుకుంటుంది అని అందుకే పేరెంట్స్‌ మనల్ని ఇవి తిననిచ్చే వాళ్లు కాదు. చూయింగమ్‌ నమలడం అనేది ఫేస్‌కు

చూయింగ్‌ గమ్‌ పొరపాటున మింగేస్తే అది ప్రేగులకు హాని చేస్తుందా.. ?


చాలామందికి టైమ్‌పాస్‌కు చూయింగ్‌ గమ్‌ నమలడం అలవాటు. పైగా ఇది ఒక ఆటిట్యూడ్‌ కూడా. అలా స్టైల్‌గా చూయింగమ్‌ నములుతూ తెగ ఫోస్‌ కొడుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా దాన్ని మింగేస్తారు. చిన్నప్పుడు చెప్పేవాళ్లు... చూయింగమ్‌ మింగితే అది పేగులకు చుట్టుకుంటుంది అని అందుకే పేరెంట్స్‌ మనల్ని ఇవి తిననిచ్చే వాళ్లు కాదు. చూయింగమ్‌ నమలడం అనేది ఫేస్‌కు మంచి వ్యాయామం. బుగ్గలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఇది డైలీ ఒక అరగంట నమిలితే మంచి ఎక్సర్‌సైజ్‌ అయి ఫేస్‌కు రక్తప్రసరణ జరిగి కొవ్వు కరుగుతుంది. ఫేస్‌కు మంచి గ్లో వస్తుంది. చూయింగ్ గమ్ మింగితే ఏమవుతుందో ఈరోజు తెలుసుకుందాం.
చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే భయపడకండి. మన శరీరం దాన్ని జీర్ణించుకోలేదు. అలా అని పేగులకు కూడా అది అంటుకోదు. మన పొట్టలో అరగని పదార్థాలు అన్నీ కూడా పేగుల ద్వారా బయటికి వెళ్లిపోతాయి. చూయింగ్ గమ్ అరిగించే శక్తి కూడా మన శరీరానికి లేదు. కాబట్టి అది పేగుల ద్వారా బయటికి వచ్చేస్తుంది. అయితే చూయింగ్ గమ్ బయటికి రావడానికి కనీసం 12 నుంచి 48 గంటల సమయం పడుతుంది. పొరపాటున మింగితే నీళ్లు అధికంగా తాగండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల చూయింగ్ గమ్ బయటికి వేగంగా మలవిసర్జన ద్వారా వచ్చేస్తుంది. 
How Does Chewing Gum Affect My Child's Teeth? | Smile Explorers
చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల సమస్యలు వస్తాయి. సాధారణంగా అయితే చూయింగ్ గమ్ బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా లోపలే ఉండిపోతే పేగులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అవుతాయి. ఇది తిన్నాక మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. 
ఒకేసారి రెండు మూడు చూయింగమ్‌లు నమలకండి.. దీనివల్ల మీరు ఎంజాయ్‌ చేస్తూ తింటారేమో కానీ.. దానిలో ఉన్న షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటు మింగినా ఇంకా ప్రమాదం కూడా అవుతుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.