అరటిపండు తెచ్చిన రెండో రోజే మగ్గిపోతున్నాయా.. ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!

ఏ కాలంలో నైనా ఎక్కువగా దొరుకుతూ కావాల్సిన అన్ని పోషకాలు అందించే పండ్లు అరటి పండ్లు సాధారణంగా వీటిని ఇంటికి తీసుకువచ్చిన రెండో రోజుకి పాడైపోయినట్టు అనిపిస్తాయి అయితే ఇవి ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు

అరటిపండు తెచ్చిన రెండో రోజే మగ్గిపోతున్నాయా.. ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!


ఏ కాలంలో నైనా ఎక్కువగా దొరుకుతూ కావాల్సిన అన్ని పోషకాలు అందించే పండ్లు అరటి పండ్లు సాధారణంగా వీటిని ఇంటికి తీసుకువచ్చిన రెండో రోజుకి పాడైపోయినట్టు అనిపిస్తాయి అయితే ఇవి ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.

Clone Wars: How Fusarium Fungi Control the Banana Industry

సాధారణంగా ఒక డజన్ అరటి పండ్లను ఇంటికి తీసుకువస్తే అందులో సగం పాడైపోతూనే ఉంటాయి ఇలా చాలాసార్లు జరిగే ఉంటుంది అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే.. అరటి పండ్లు ఎథిలీన్‌ వాయువును ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు ఈ వాయువుని ఎక్కువగా విడుదల చేస్తుంది దీని వలన చెట్టు నుంచి కోసిన తర్వాత, అరటి పండ్ల తొడిమల నుంచి విడుదలయ్యే ఎథిలీన్‌ వాయువు వల్ల పచ్చని కాయలు పండిపోయే వేగం పెరుగుతుంది. ఒకసారి ఇలా పండే ప్రక్రియ మొదలైతే, దాన్ని సహజసిద్ధంగా ఆపడం కష్టం. పచ్చిగా ఉండే ఇతర కాయలను అరటి పండ్ల దగ్గర ఉంచితే, ఆ వాయువు ప్రభావానికి మిగతా పండ్లు కూడా త్వరగా మగ్గడం మొదలుపెడతాయి. అయితే అరటి పండ్లు మగ్గే వేగాన్ని నియంత్రించడం కోసం ఈ చిట్కాలు పాటించవచ్చు.

సాధారణంగా అరటిపండ్లను దేనికి దానికి వేరు చేస్తూ ఉంటారు అయితే ఇలా కాకుండా అరటి పండ్లను హస్తాన్ని విడదీయకుండా అలాగే ఉంచి, ఒక్కో పండును తెంచుకుని తినాలి. అలాగే చెట్టుకు వేలాడే గెలలా, ఈ హస్తాన్ని హ్యాంగర్‌కు తగిలించి గోడకు వేలాడదీస్తే త్వరగా పండిపోకుండా ఉంటాయి. అలాగే వేలాడేటప్పుడు అవి దేనికీ తగలకుండా గాల్లో వేలాడుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల యాసిడ్‌ బ్రేక్‌డౌన్‌ నెమ్మదించి, మగ్గే వేగం తగ్గుతుంది.

అలాగే నేరుగా ఎండ తగిలే చోట, వేడిగా ఉండే వంటగదిలో కాకుండా, చల్లని, చీకటి ప్రదేశంలో అరటి పండ్లను వేలాడదీయాలి. అరటి పండు స్టెమ్‌ నుంచి ఎథిలీన్‌ విడుదల అవుతూ ఉంటుంది. కాబట్టి స్టెమ్‌ను అల్యూమినియం లేదా ఫాయిల్‌తో చుట్టి ఉంచాలి. 
ఇందుకోసం అరటి పండ్లను విడదీసి, స్టెమ్‌కు విడివిడిగా ఫాయిల్‌ చుట్టాలి. తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అరటి పండ్ల తొక్క రంగు గోధుమ రంగుకు మారిపోవచ్చు. కానీ లోపలి పండు తాజాగానే ఉంటుంది. సాధారణంగా పండిన అరటి పండులో షుగర్ ఎక్కువగా ఉంటుంది కొంత పచ్చిగా ఉన్న అరటిపండు లో మాత్రమే పోషకాలు అధికంగా ఉంటాయి అందుకే వీటిని ఎప్పటికప్పుడు తినేయడం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.