మీ పార్టనర్‌తో ఇలా చేస్తే ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది..!

ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది. ఈ పునాది స్ట్రాంగ్‌గా ఉంటేనే.. ప్రేమ, అర్థంచేసుకోవడం, భరించడం, భాగం అవ్వడం అన్నీ వస్తాయి. మీ రిలేషన్‌షిప్‌లో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇది మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు.. వెళ్లి ఒక కేజీ పట్టుకొచ్చేయడానికి. మీ ప్రవర్తన, మాటతీరు, మీ పార్టనర్‌తో మీరు నడుచుకునే విధానం బట్టే ఇది ఆటోమెటిక్‌గా ఏర్పడుతుంది.

మీ పార్టనర్‌తో ఇలా చేస్తే ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది..!


ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది. ఈ పునాది స్ట్రాంగ్‌గా ఉంటేనే.. ప్రేమ, అర్థంచేసుకోవడం, భరించడం, భాగం అవ్వడం అన్నీ వస్తాయి. మీ రిలేషన్‌షిప్‌లో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇది మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు.. వెళ్లి ఒక కేజీ పట్టుకొచ్చేయడానికి. మీ ప్రవర్తన, మాటతీరు, మీ పార్టనర్‌తో మీరు నడుచుకునే విధానం బట్టే ఇది ఆటోమెటిక్‌గా ఏర్పడుతుంది. మీ రిలేషన్‌షిప్‌లో నమ్మకం పెరగాలంటే.. బేసిక్‌గా కొన్ని పాయింట్స్‌ను గుర్తుపెట్టుకోండి.. 
ట్రస్ట్‌ లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లో సేఫ్, సెక్యూర్‌గా ఉండలేం. భాగస్వామిని విశ్వసిస్తే, ఒకరికొకరు ఆనందంగా ఉండొచ్చు. అబద్ధం లేదా ద్రోహం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సరదాగా లైఫ్ గడిపేస్తూ సంతోషకరమైన జీవితాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. పార్ట్‌నర్‌కు క్షమాపణ చెప్పడం అంటే తప్పు మనదే అని ఒప్పుకున్నట్లు కాదు, వారు రైట్ అనీ కాదు. అహంకారం కంటే సంబంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం. సంబంధంలో నమ్మకాన్ని బలోపేతం చేయాలనుకుంటే, తప్పు ఎవరిది అన్నది తేల్చడం ముఖ్యం కాదు. క్షమించండి అని చెప్పడం. పార్ట్‌నర్‌ పట్ల కేర్ తీసుకుంటున్నామని, సంబంధానికి మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చూపించడానికి నిస్సందేహంగా చెప్పడం ఒక ఉత్తమ మార్గం. 
Relationship Goals or Couple Goals every couple must achieve
అబద్ధం చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడూ చెప్పకూడదు. ఒక చిన్న అబద్ధమైనా సరే అది రిలేషన్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. నమ్మకాన్ని పోగొట్టగలదు. రిలేషన్‌షిప్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితులలో కూడా అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి గొడవలు కావు.
 
ఎలాంటి సంబంధంలోనైనా నమ్మకం ముఖ్యం, బ్రోకెన్ ప్రామిసెస్ ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రామిస్ బ్రేక్ చేస్తే సిన్సియర్‌గా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇచ్చిన మాట తప్పకుండా ఉండటం ద్వారా నమ్మకాన్ని రీబిల్డ్‌ చేసుకోవచ్చు. అలాగే నెరవేర్చలేని ప్రామిస్‌లను ఆవేశంగా చేయకండి.  
ఏదైనా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పార్ట్‌నర్‌ అభిప్రాయాన్ని అడగాలి. ఏదైనా చేసే ముందు వారి సలహాను అడగాలి. వారి అభిప్రాయానికి విలువ ఇస్తున్నామని, వారిని విశ్వసిస్తున్నామని ఈ చర్య వారికి తెలియజేస్తుంది. ఇది రిలేషన్‌లో టీమ్‌వర్క్ భావాన్ని పెంపొందిస్తుంది. అలాగే రిలేషన్ కూడా మరింత బలంగా మార్చుతుంది.
 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.