ఖర్చు లేకుండా కాలేయాన్ని క్లీన్‌ చేద్దామా..!

లవర్‌ లేకపోయినా బతకొచ్చు గానీ, లివర్‌ లేకపోతే కష్టం భయ్యా..! మనం తీసుకునే ఆహారంలో ఎన్నో విషపదార్థాలు ఉంటాయి, పైగా మనం ఏరికోరి బయట చేసిన జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తింటాం. వీటిలో ఉండే విషపదార్థాలన్నింటిని కాలేయం ఖాళీ చేస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య

ఖర్చు లేకుండా కాలేయాన్ని క్లీన్‌ చేద్దామా..!


లవర్‌ లేకపోయినా బతకొచ్చు గానీ, లివర్‌ లేకపోతే కష్టం భయ్యా..! మనం తీసుకునే ఆహారంలో ఎన్నో విషపదార్థాలు ఉంటాయి, పైగా మనం ఏరికోరి బయట చేసిన జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తింటాం. వీటిలో ఉండే విషపదార్థాలన్నింటిని కాలేయం ఖాళీ చేస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కాలేయంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోయి కాలేయ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తింటుంది. దీంతో కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం కాలేయంలో పేరుకుపోయిన మ‌లినాల‌న్నింటిని తొల‌గించుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డ‌డంతో పాటు ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. 

ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం సొర‌కాయ‌, కొత్తిమీర‌, ప‌సుపు, నిమ్మ‌కాయ‌, న‌ల్ల ఉప్పు, తిప్ప‌తీగ ర‌సాన్ని( గిలోయ్ ర‌సాన్ని) ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్‌లో సొర‌కాయ ముక్క‌లు, కొత్తిమీర, ముప్పావు గ్లాస్ నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ న‌ల్ల ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, 30 ఎమ్ ఎల్ తిప్ప తీగ ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లో మ‌న కాలేయం ఎంతో శుభ్ర‌ప‌డుతుంది. కాలేయంలో పేరుకుపోయిన మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. ఈ పానీయం త‌యారీలో ఉప‌యోగించిన తిప్ప‌తీగ మ‌న‌కు ఆయుర్వేద దుకాణాల్లో, మందుల షాపుల్లో లేదా ఆన్ లైన్‌లోనూ సుల‌భంగా ల‌భిస్తుంది.
ఈ పానియం కాలేయాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఇవి అన్నీ కూడా స‌హ‌జ సిద్ద‌మైన‌వే. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. ఈ చిట్కాను పాటిస్తూనే చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.