ఎంత ఎక్కువగా ఉన్న బీపీ అయినా సరే.. అవిసె గింజలు తింటే తగ్గాల్సిందే

లైఫ్‌స్టైల్‌ డిసార్డర్స్‌లో బీపీ కూడా ఒకటి. నేడు నూటికి 60 శాతం మంది షుగర్‌, బీపీ సమస్యలతు కాలం వెల్లదీస్తున్నారు. 30 దాటడంతోనే ఈ రోగాలు వచ్చేస్తున్నాయి.ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణం ఎక్కువ‌యి సాగే గుణం త‌క్కువ‌వ్వ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మ‌ద్య‌పానం, కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి

ఎంత ఎక్కువగా ఉన్న బీపీ అయినా సరే.. అవిసె గింజలు తింటే తగ్గాల్సిందే


లైఫ్‌స్టైల్‌ డిసార్డర్స్‌లో బీపీ కూడా ఒకటి. నేడు నూటికి 60 శాతం మంది షుగర్‌, బీపీ సమస్యలతు కాలం వెల్లదీస్తున్నారు. 30 దాటడంతోనే ఈ రోగాలు వచ్చేస్తున్నాయి.ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణం ఎక్కువ‌యి సాగే గుణం త‌క్కువ‌వ్వ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మ‌ద్య‌పానం, కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న ఇవన్నీ ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు. బీపీ కార‌ణంగా అనేక ర‌కాల గుండె జ‌బ్బులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు వ‌స్తూ ఉంటాయి. బీపీని సైలెంట్ కిల్ల‌ర్‌గా వైద్యులు అంటారు.
The Genetics of Hypertension
మందులు వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో బీపీ అదుపులో ఉండ‌దు. అలాంటి వారు మందుల‌తో పాటుగా కొని ఆయుర్వేద చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజ‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజ‌లు ర‌క్త‌నాళాల్లో ముడుచుకునే గుణాన్ని త‌గ్గించి సాగే గుణాన్ని పెంచ‌డంలో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కెన‌డా దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 100 గ్రాముల అవిసె గింజ‌ల్లో 13 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 26 గ్రాముల ఫైబ‌ర్ ఉంటాయి. అలాగే వీటిలో లిగ్నాన్స్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్త‌నాళాల్లో మార్పును తీసుకువ‌చ్చి సాగే గుణాన్ని పెంచుతున్నాయి.
 
ర‌క్త‌నాళాలు సాగి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రుగుతుంది. త‌ద్వారా ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం చాలా మంచిది. రోజుకు 30 గ్రాముల అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో మార్పు వ‌చ్చి ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ అవిసె గింజ‌ల‌ను దోర‌గా వేయించి లేదా వాటితో కారం పొడిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే వీటిని పొడిగా చేసి స‌లాడ్స్, కూర‌ల్లో వేసుకుని తిన‌వ‌చ్చు. అవిసె గింజ‌ల‌తో ఖ‌ర్జూరాల‌ను క‌లిపి ఉండ‌లుగా చేసుకుని కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు.
అవిసె గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉండ‌డంతో పాటు ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో, చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించడంలో కూడా ఈ అవిసె గింజ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.