Wisdom toothache: జ్ఞానదంతం నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ చిట్కాలు ట్రై చేయండి..

Tips for wisdom tooth pain : జ్ఞానదంతం వస్తుందంటే.. అమ్మో ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏది తినలేం, తాగలేం..ఒక సైడ్‌ అంతా నరకమే. కొంతమంది ఈ నొప్పిని భరించలేక దంతాన్ని తీయించుకుంటారు. అలా చేయకూడదు.అయితే ఈ నొప్పిని కొన్ని చిట్కాల (tips for wisdom tooth pain) ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు.

Wisdom toothache: జ్ఞానదంతం నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ చిట్కాలు ట్రై చేయండి..
Wisdom tooth pain


జ్ఞానదంతం వస్తుందంటే.. అమ్మో ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏది తినలేం, తాగలేం..ఒక సైడ్‌ అంతా నరకమే. కొంతమంది ఈ నొప్పిని భరించలేక దంతాన్ని తీయించుకుంటారు. అలా చేయకూడదు.. ప్రకృతి విరుద్ధం.. మనకు ఒక ఏజ్‌ వచ్చినప్పుడే ఆ దంతం వస్తుంది అంటే.. మీకు ఆ టైమ్‌లో అది రావడం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించి లింక్‌ ఉంటుంది. నొప్పిని భరించాలి.. అయితే ఈ నొప్పిని కొన్ని చిట్కాల (tips for wisdom tooth pain) ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు.

జ్ఞానదంతం నొప్పిని తగ్గించుకోవాలంటే (tips for wisdom tooth pain) ..

కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటిని బాగా న‌మిలి మింగాలి. న‌మిలే స‌మ‌యంలో వ‌చ్చే ర‌సం నోట్లో అంత‌టా చేరేలా చూసుకోవాలి. దీంతో పుదీనాలో ఉండే రసాయనం.. నొప్పి నివార‌ణ గుణాలు నొప్పిని త‌గ్గిస్తాయి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే జ్ఞాన దంతం నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ల‌వంగం నూనె తీసుకుని అందులో కొద్దిగా దూదిని నాన‌బెట్టాలి. గంట పాటు నాన‌బెట్టాక ఆ దూదిని తీసి నొప్పి ఉన్న చోట ఉంచాలి. 10 నిమిషాల పాటు ఉంచితే నొప్పి నుంచి బాగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా రోజుకు 3, 4 సార్లు చేయ‌వ‌చ్చు.

ఉల్లిపాయ‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, నొప్పి నివార‌ణ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఒక చిన్న ఉల్లిపాయ‌ను కుని స‌గం క‌ట్ తీసుచేయాలి. దాన్ని నోట్లో వేసి బాగా న‌మిలి మింగాలి. న‌మిలే స‌మ‌యంలో నొప్పి ఉన్న చోట ర‌సం తాకేలా చూడాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే దంతాల నొప్పి త‌గ్గుతుంది.

ఒక క‌ప్పు గోరువెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే జ్ఞాన‌దంతాల నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

జ్ఞాన దంతం నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల కారణముగా చిగుళ్ల మంట మరియు వాపు రాకుండా చేస్తుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనె నోటిలో వేసుకొని 10 నిమిషాల పాటు బాగా పుక్కలించి బయటకు ఊసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోండి.

ఒకటి నుండి రెండు వెల్లుల్లిపాయల రెబ్బలను తీసుకొని చితక్కొట్టండి.ఆ ముద్దని మీ జ్ఞాన దంతం దగ్గర పెట్టండి. నొప్పి తగ్గుతుంది. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.