Dark circles : కళ్లకింద నల్లటి వలయాలు, మొటిమలా ? ఇలా చేస్తే వారంలో మాయం..!

Dark circles వల్ల అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఇద్దరూ బాధపడుతున్నారు. వీటి కోసం ఏమైనా క్రీమ్స్‌ వాడితే.. కళ్లు ఎక్కడ దెబ్బతింటాయో అని భయం.. ఇప్పుడు చెప్పుకోబోయో ఆయుర్వేదిక్‌ చిట్కాలతో కళ్ల నల్లటి వలయాలను, మెటిమలను రెండింటిని తరిమికొట్టేయొచ్చు..!

Dark circles : కళ్లకింద నల్లటి వలయాలు, మొటిమలా ? ఇలా చేస్తే వారంలో మాయం..!
Remove Dark circles under the eyes, pimples


Dark circles, pimples : మనం ఎంత ఆరోగ్యంగా, అందంగా ఉన్నామో.. మన కళ్లను చూసే చెప్పేయొచ్చు. మీ కళ్లే మీ వయసును కూడా బయటపడేలా చేస్తాయి.. కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉంటే.. మనిషి ముఖం కూడా బాగుంటుంది. కానీ ఈరోజుల్లో లేట్‌నైట్‌ చాటింగ్‌లు, నైట్‌ షిఫ్ట్‌లు, చాలి చాలని నిద్ర వల్ల కళ్ల కింద dark circles వచ్చేస్తున్నాయి. ఈ డార్క్‌ సర్కిల్స్‌ వల్ల అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఇద్దరూ బాధపడుతున్నారు. వీటి కోసం ఏమైనా క్రీమ్స్‌ వాడితే.. కళ్లు ఎక్కడ దెబ్బతింటాయో అని భయం.. ఇప్పుడు చెప్పుకోబోయో ఆయుర్వేదిక్‌ చిట్కాలతో కళ్ల నల్లటి వలయాలను, మెటిమలను రెండింటిని తరిమికొట్టేయొచ్చు..!
ఒక పాత్రలో నీటిని బాగా మరిగించాలి. ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని ముఖానికి 8-10 నిమిషాల పాటు పట్టించాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే వారం రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మొటిమలు, నల్లని వలయాలు తగ్గుతాయి.
వేప పువ్వులను కొన్ని తీసుకుని బాగా నూరి ముద్దలా చేయాలి. అందులో కొద్దిగా పసుపు, వెన్న కలిపి మిశ్రమంగా చేయండి.. దాన్ని మొటిమలు లేదా నల్లని వలయాలపై రాయాలి. తరువాత ఒక గంట పాటు ఉంచి క్లీన్‌ చేయండి. ఇలా రోజూ చేస్తే వారం రోజుల్లోనే మొటిమలు, నల్లటి వలయాలు పోతాయి.

పోక చెక్కను నీళ్లతో గంధం తీసి ముఖానికి పట్టించి 3 గంటల తరువాత కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ఇది కొంచెం టైమ్‌ పట్టినా రిజల్ట్‌ బాగుంటుంది.
పాల మీగడలో పసుపు, పొట్లకాయపై పొట్టు, నువ్వులు కలిపి ముఖానికి రాసుకుంటే అన్ని రకాల మొటిమలు తగ్గుతాయి. నల్లని వలయాలు కూడా ఉండవు.. ముఖం అందంగా నిగారిస్తుంది.

ఈ జాగ్రత్తలు కూడా..

నల్లటి వలయాలు రావడానికి ప్రధాన కారణం.. రాత్రుళ్లు ఫోన్‌ లైట్‌లోనే ఫోన్స్‌ వాడటం.. రూమ్‌లో లైట్స్‌ ఆపేశాక ఫోన్‌ చూడటం, టీవీ చూడటం వల్ల ఆ లైటింగ్‌ నేరుగా కళ్లమీద పడి కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ వస్తాయి.. కాబట్టి ఈ అలవాటు మానుకోండి.
సరిపడా వాటర్‌ తాగండి. 
వారంలో ఒక్కసారి అయినా క్యారెట్‌ జ్యూస్‌, బీట్‌ రూట్‌ జ్యూస్‌ లాంటివి తాగుతండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.