రోజుకు కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేస్తే బాడికి ఫుల్‌ ఎక్సర్‌సైజ్‌

ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం అరగంటపాటైనా వ్యాయామం చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు భారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. వ్యాయామం, యోగా ఏదైనా సరే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు. శరీర ఆకృతి చాలా

రోజుకు కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేస్తే బాడికి ఫుల్‌ ఎక్సర్‌సైజ్‌


ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం అరగంటపాటైనా వ్యాయామం చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు భారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. వ్యాయామం, యోగా ఏదైనా సరే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు. శరీర ఆకృతి చాలా ముఖ్యమైనది. మంచి శరీర ఆకృతి కావాలంటే తినే ఆహారం మొదలు, రోజు వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వ్యాయామంలో పడి స్కిప్పింగ్‌ను స్కిప్‌ చేస్తున్నారు. స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయమం చేసినట్లే తెలుసా..? యోగా కానీ, ఎక్సర్‌సైజ్‌లు కానీ ఒక్కో పార్ట్‌కు ఒక్కోటి ఉంటుంది. కానీ స్కిప్పింగ్‌ చేస్తే అన్ని అవయవాలకు వ్యాయామం అవుతుంది.
For How Long Should You Do Cycling For Weight Loss? Expert Reveals  Important Do's And Don'ts Of Cycling
 
శ‌రీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట‌ (స్కిప్పింగ్‌) తో ఫిట్‌నెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ సూచిస్తున్నారు. శ‌రీరంలోని అవ‌య‌వాల క‌ద‌లిక‌ను వేగ‌వంతం చేయ‌డంతోపాటు వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి స్కిప్పింగ్ తోడ్ప‌డుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం గ‌ట్టి ప‌డుతుంది. ఎముక‌లు గ‌ట్టి ప‌డ‌డంతోపాటుగా చ‌ర్మంపై ఏర్ప‌డిన ముడ‌త‌లు తొలగిపోతాయి. స్కిప్పింగ్ చేసేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాలి.
పాదాల‌కు ర‌క్ష‌ణ లేకుండా స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల అరికాళ్ల‌కు నొప్పి క‌లుగుతుంది. దాంతోపాటుగా పాదాలల్లో ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి. ముఖ్యంగా కాంక్రీటు నేల‌పై స్కిప్పింగ్ చేసేట‌ప్పుడు షూస్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.
బ‌రువు త‌గ్గించ‌టంలో స్కిప్పింగ్ కీల‌క పాత్ర పోషిస్తుంది. స్కిప్పింగ్ ప్రారంభించే ముందు వార్మ‌ప్ చేయ‌డం వ‌ల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. తొడ‌లు, చేతులు, భుజాలు, పొట్ట భాగంలో ఏర్ప‌డిన కొవ్వు నిల్వ‌లు క‌రిగిపోయి కండ‌రాలు ప‌టిష్టంగా త‌యార‌వుతాయి. రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. అన్ని విధాలుగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
రోజుకు కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేసినా చాలు.. ఆరోగ్యకరమైన ఫలితాలు కలుగుతాయని.. నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మందికి స్కిప్పింగ్‌ మీద అపోహలు ఉన్నాయి. వయసులో ఉన్న మహిళలు స్కిప్పింగ్‌ చేస్తే గర్భసంచి లూస్‌ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్‌ అవుతుందని. ఇవి కేవలం అపోహ మాత్రమే. రోజు కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల లాభాలే కానీ ఎలాంటి నష్టాలు ఉండవు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.