వ్యాయామం చేస్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే కష్టమే.. !

వ్యాయామం చేయాలని అందరికీ ఉంటుంది కానీ కొన్ని కారణాలతో మొదలుపెట్టిన మధ్యలో ఆపేస్తూ ఉంటారు అయితే ఎలా చేయడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు అందుకే వ్యాయామం చేసినప్పుడు

వ్యాయామం చేస్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే కష్టమే.. !


వ్యాయామం చేయాలని అందరికీ ఉంటుంది కానీ కొన్ని కారణాలతో మొదలుపెట్టిన మధ్యలో ఆపేస్తూ ఉంటారు అయితే ఎలా చేయడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు అందుకే వ్యాయామం చేసినప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.. 

వ్యాయామం చేయాలి అనుకునేవారు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్రమశిక్షణ ఉండాలి ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి అనే నియమాన్ని పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో వ్యాయామం చేయాలి అనుకునేవారు కచ్చితంగా నాలుగు ఐదు గంటలు ముందే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది తిన్న వెంటనే వ్యాయామం చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు.. దీనివలన శరీర కండరాలకు తగినంత శక్తి చేకూరక నీరసం ఆవహిస్తుంది అలాగే కండరాలు పట్టేయడంతో పాటు కడుపులో వికారంగా అనిపిస్తుంది.. 

అలాగే వ్యాయామం చేయడానికి ముందు కచ్చితంగా దానికి పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి అలాగే కాసేపు శరీరాన్ని తేలిక చేసుకునే పనులు చేయాలి దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్తం సరఫరా మెరుగు పడుతుంది ఫలితంగా కండరాలు అని వదలవుతాయి.. అలాగే ముందస్తు వ్యాయామాలు చేయకుండా నేరుగా వ్యాయామం చేస్తే కండరాలు నొప్పులు పుడతాయి మిగదుగా అవుతాయి

అలాగే వ్యాయామం చేసినప్పుడు కచ్చితంగా సరైన భంగిమలో ఉండాలి లేకపోతే ఎక్కడికి అక్కడ కండరాలు పట్టేసే అవకాశం ఉంటుంది... శరీరాన్ని సమయంలో నిటారుగా ఉంచుకోవాలి బరువులు ఎత్తేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి వెన్నెముకను తిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి మోకాలు మరింత బిగుతుగా పట్టేసేటట్టు ఉండకూడదు అలాగే వ్యాయామానికి ఎంచుకొని షూస్ కూడా తగిన విధంగా ఉండాలి. వీటిలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల విపరీతమైన కాళ్లు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది..

వ్యాయామం చేసేవారు తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం.. టోస్ట్ చేసిన గోధుమ బ్రెడ్, స్మూతీస్ తీసుకున్నా మంచిదే. అలాగే పెరుగును బాగా గిలకొట్టి పండ్ల ముక్కల్లో వేసి.. పైన కాస్త తేనె చేర్చాలి. దీన్ని తింటే అరుగుదల బాగుంటుంది.. వ్యాయాయం మధ్యలో నీళ్లూ తాగుతుండాలి. అలాగే పూర్తయ్యాక కాసేపు రిలాక్స్ కావాలి. ఆ తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. జాగింగ్, రన్నింగ్ చేసేవారు ఓట్‌మీల్ తీసుకుంటే కావల్సిన శక్తి అందుతుంది.. అలాగే జావ, ఉప్మా ఏదైనా తీసుకోవచ్చు. అలానే మార్కెట్లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ అందుబాటులో ఉంది. దీని మీద తేనె రాసి తిన్నా మంచిదే.. వ్యాయామం చేసే వారికి నీరు ఎక్కువగా అవసరం. అలాగే కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.