పీరియ‌డ్స్ సమయంలో కడుపు నొప్పా?.. ఇలా చేస్తే సరి!

పీరియ‌డ్స్ సమయంలో కొంద‌రు మ‌హిళ‌లు విప‌రీత‌మైన కడుపునొప్పితో బాధపడతారు. కొంద‌రికి ఒక‌టి, రెండు రోజుల్లో నెలసరి బాధలు తగ్గితే.. మ‌రి కొందరికి వారం రోజుల వరకు అలానే ఉంటది.  తిమ్మ‌ర్లు రావ‌టం, వికారం, క‌డుపు ఉబ్బ‌రం, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వ‌టం లాంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే వీటికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.స‌రిప‌డా నిద్ర.

పీరియ‌డ్స్ సమయంలో కడుపు నొప్పా?.. ఇలా చేస్తే సరి!


పీరియ‌డ్స్ సమయంలో కొంద‌రు మ‌హిళ‌లు విప‌రీత‌మైన కడుపునొప్పితో బాధపడతారు. కొంద‌రికి ఒక‌టి, రెండు రోజుల్లో నెలసరి బాధలు తగ్గితే.. మ‌రి కొందరికి వారం రోజుల వరకు అలానే ఉంటది.  తిమ్మ‌ర్లు రావ‌టం, వికారం, క‌డుపు ఉబ్బ‌రం, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వ‌టం లాంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే వీటికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.స‌రిప‌డా నిద్ర.. నెల‌స‌రి స‌మ‌యంలో శ‌రీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాలి.  కాబ‌ట్టి సాధ్య‌మైనంత ఎక్కువ‌గా నిద్ర‌పోవాలి.. దీని వ‌ల్ల కడుపునొప్పిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం వ‌స్తుంది.. శరీరం శక్తి పెరుగుతుంది.

పోషక మితాహారం .. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం నెలసరి స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌టంలో కీలక పాత్ర పోషిస్తుంది. తాజా తృణ ధాన్యాలు, స‌లాడ్లు, పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవాలి. అర‌టి పండ్లు, నారింజ‌, పుచ్చ‌కాయ‌, బ్ర‌కోలి, చ‌మోమైల్ టీ, వంటి వాటిని మీ రెగ్యుల‌ర్ డైట్​లో త‌ప్పనిస‌రిగా చేర్చుకోవాలి.
తేలికపాటి వ్యాయామం.. సాధార‌ణ రోజులతో పాటు నెలసరి సమయంలోను వ్యాయామం చేయడం మంచిది. రెగ్యుల‌ర్​గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మూడ్ స్వింగ్స్ మార‌టం, కడుపు నొప్పి, తిమ్మ‌ర్లు రావ‌టం వంటి ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ తీవ్ర‌త‌ల‌ను త‌గ్గిస్తుంది. యోగా చేయ‌డం కూడా మంచిది
హీటింగ్ ప్యాడ్..పీరియ‌డ్స్ స‌మ‌యంలో హీటింగ్ ప్యాడ్స్ ఉప‌యోగించ‌డం  ఉప‌శ‌మ‌నం కలిగిస్తుంది. వీటిని వాడ‌టం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు కావ‌డం సహా ఉద‌ర కండ‌రాల‌కు ఆక్సిజ‌న్ ప్ర‌వాహాన్ని పెంచుతుంది.
ఉప్పు, కాఫీల‌ను త‌గ్గించాలి..   ఆహారంలో మోతాదుకు మించి ఉప్పును వాడకూడదు. పీరియ‌డ్స్ స‌మ‌యంలో కెఫిన్ అధికంగా ఉండే టీ, కాఫీల‌ను తాగ‌టం తగ్గించాలి. నెలసరి సమయంలో టీ, కాఫీ తాగడం వల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ నెమ్మ‌దించడం సహా క‌డుపు ఉబ్బ‌రం, మంట‌ను క‌లుగజేస్తాయి.
ఆక్యుపంక్చ‌ర్..నాడీ వ్య‌వ‌స్థ‌ను రిలాక్స్​గా ఉంచ‌టంలో, తిమ్మ‌రి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డంలో ఆక్యుపంక్చ‌ర్..  సంప్ర‌దాయ ఆసియా ఔష‌ధ సాంకేతిక‌త ఉపయోగపడుతుంది. ఇది ర‌క్త ప్ర‌వాహాన్ని పెంచుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.