గర్భాశయ క్యాన్సర్ రకాలు..కారణాలు..లక్షణాలు..

మహిళల్లో సాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా నమోదయ్యే క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్. దీనినే అండాశయ క్యాన్సర్ అని కూడా అంటారు.. ముఖ్యంగా అండాశయాల్లో కణాలు విపరీతంగా పెరిగి

గర్భాశయ క్యాన్సర్ రకాలు..కారణాలు..లక్షణాలు..


మహిళల్లో సాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా నమోదయ్యే క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్. దీనినే అండాశయ క్యాన్సర్ అని కూడా అంటారు.. ముఖ్యంగా అండాశయాల్లో కణాలు విపరీతంగా పెరిగి పక్కన ఉన్న భాగాలకు వ్యాపించడాన్నే ఒవేరియన్ క్యాన్సర్ అంటారు.. 

గర్భాశయానికి రెండు వైపులా అండాశయాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.. ఈ అండాశయాలు అండాలని విడుదల చేయడంతో పాటు మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవే స్త్రీలలో నెలసరి రావటానికి సహాయపడతాయి.. అంతేకాకుండా గర్భధారణకు సైతం సహాయ పడతాయి. అయితే ఈ హార్మోన్లు సక్రమంగా విడుదలైన అంతకాలం ఎలాంటి సమస్యలు రావు. కానీ వీటిల్లో ఎలాంటి లోపాలైన తలెత్తితే పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా గర్భాశయంలో టిష్యూస్ విపరీతంగా పెరిగితే ఈ గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తుంది..

అలాగే సంతానం లేని స్త్రీలలో.. సంతానం కోసం అధికంగా మందులు వాడే స్త్రీలలో.. ముందు తరాల్లో ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్ ఉంటే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ గర్భసయ్య క్యాన్సర్ మూడు రకాలు అవి ఏంటంటే.. 

ఒవేరియన్‌ క్యాన్సర్ రకాలు.. 

1. ఎపిథిలియల్‌ ఒవేరియన్‌ క్యాన్సర్‌... ఇది సాధారణంగా వయసు పైబడిన స్త్రీలలో వస్తుంది.. 

2. జెర్మ్‌సెల్‌ ఒవేరియన్‌ క్యాన్సర్‌. యుక్త వయసు అమ్మాయిలను వేధించే క్యాన్సర్ ఇదే ఈ కణాలు నుంచే పుడతాయి అవి పెరిగి ఇతర కణాలకు వ్యాపించి క్యాన్సర్ గా దారి తీస్తాయి..

3. స్టోమల్‌ సెల్‌ ఒవేరియన్‌ క్యాన్సర్‌.. ఈ క్యాన్సర్ కు సంబంధించిన కణాలు అందాలలో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే చోట తయారవుతాయి అయితే స్త్రీలలో ఈస్ట్రోజన్ ప్రోసిస్టెంట్ హార్మోన్లు ఎక్కువగా దీర్ఘకాలం విడుదలవుతూ ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది..

ఈ క్యాన్సర్ ను అంత తొందరగా గుర్తించలేరు. ముఖ్యంగా అండాశయాలు పొత్తికడుపులో చాలా లోపలికి ఉండటం వల్ల ఈ లక్షణాలు అంత తొందరగా బయటపడవు. క్రమక్రమంగా కొన్ని లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ముందుగా కనిపిస్తాయి.. 

Ovarian Cancer Causes & Risk Factors | Types & Stages

లక్షణాలు.. 

తరచూ మాత్రం రావడం.. 
యోని స్రవాలు ఎక్కువగా స్రవించడం..
పొత్తికడుపులో విపరీతమైన నొప్పి..
ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి రావడం..
ఎక్కువగా ఆహారం తీసుకోలేకపోవడం..
వెన్నునొప్పి నడుం నొప్పి వేధించటం.. 
కలయిక సమయంలో ఇబ్బందిగా అనిపించడం..

ఈ వ్యాధిని తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు. ముఖ్యంగా ఇందులో సర్జరీ, థెరపీలు వంటివి ఇస్తారు. అలాగే క్యాన్సర్ ఏ స్థితిలో ఉందో అనే దాన్ని బట్టి థెరపీ ఆధారపడి ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడిన అమ్మాయిలు తీసుకునే కీమోథెరపీ, రేడియో థెరపీ వలన మోనోపాజ్ తొందరగా రావడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఏర్పడటం వంటివి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ క్యాన్సర్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి 25, 30 ఏళ్లు దాటిన దగ్గర నుంచి దీనికి సంబంధించిన చెకప్ లో చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం వల్ల మెరుగైన చికిత్సను తీసుకోవడంతో పాటు ప్రమాదం నుండి బయటపడవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.